Medak : క్యాథెడ్రిల్ చర్చి అభివృద్దికి రూ. 35 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి
వచ్చే ఏడాది కూడా సీఎం హోదాలోనే ఉంటా..క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని కోరారు.
- By Latha Suma Published Date - 04:06 PM, Wed - 25 December 24

Medak : మెదక్ క్యాథెడ్రిల్ చర్చిని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. చర్చి శతాబ్ది ఉత్సవాలు, క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతుండడంతో ఆయా కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మెదక్ చర్చి అభివృద్దికి రూ. 35 కోట్లు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది కూడా సీఎం హోదాలోనే ఉంటా..క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని కోరారు.
మా ప్రభుత్వం పది కాలాల పాటు వర్ధిల్లాలని కోరారు. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఏ అవసరం ఉన్న మంత్రులు దామోదర, కొండా సురేఖ దృష్టికి తీసుకురండి.. అందరికి హ్యాపీ క్రిస్మస్ అని తెలిపారు. దేశంలోనే మెదక్ చర్చి గొప్ప చర్చి అని… మెదక్ చర్చి అభివృద్దికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు న్యాయం జరుగుతుందని…. ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువగా దళిత, గిరిజన క్రైస్తవులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. పంట బోనస్ కూడా కర్షకులకు మా ప్రభుత్వం ఇస్తోందన్నారు. రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేసి పేద రైతులకు భరోసా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మెదక్ జిల్లాలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నేడు పర్యటించనున్నారు. కౌడిపల్లి మండలం తునికి కృషివిజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు.
Read Also: Sandhya Theatre Incident : శ్రీ తేజ్ కుటుంబానికి రూ.2కోట్ల సాయం: అల్లు అరవింద్