KTR : కేటీఆర్ మాటలు కంపు కొడుతున్నాయట..
KTR : కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని.. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే సంబురాలు చేసుకుంటున్నాడని మధుసూదన్ ఆరోపించారు
- By Sudheer Published Date - 04:46 PM, Thu - 10 October 24

బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల (BRS – Congress) మధ్య మాటల వార్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అంశాలపైనే కాదు పక్క రాష్ట్రాలకు సంబదించిన అంశాలపై కూడా ఒకరి పై ఒకరు మాటలు వదులుకుంటున్నారు. ఇప్పటికే హామీలు, హైడ్రా , మూసి సుందరీకరణ , రుణమాఫీ వంటి అంశాలపై బిఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుండగా..తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాలపై (Haryana Election Results) కూడా విమర్శలకు దిగింది. హర్యానా ఫలితాలు చూసైనా రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ జాగ్రత్త పడాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడాలని హితవు పలికారు. అంతే కాదు కేటీఆర్..పలు హెచ్చరికలు సైతం జారీ చేసాడు.
కాగా కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (Devarakadra MLA Madhusudhan Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని.. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే సంబురాలు చేసుకుంటున్నాడని మధుసూదన్ ఆరోపించారు. బీజేపీ గెలిచిందని సంకలు గుద్దుకుంటుండని., అక్కడ ఈవీఎంలు అవకతవకలు త్వరలో బయట పడతాయని., కాశ్మీర్ లో బీజేపీ ఓడిపోతే చప్పుడు చెయట్లేదని., రాహుల్ గాంధీ పై కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మోరిగే కుక్క కరవదు. కేటీఆర్ మాటలు ఎవరు పట్టించుకోరని., కేటీఆర్ తాత ముత్తాతలు దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి కాదని ధీమా వ్యక్తం చేసారు. 10 ఏళ్లపాటు స్కామ్ లు చేసి చేసిన కేటీఆర్ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కామ్ లు జరగట్లేదని, వాళ్ళ చేసిన స్కామ్ లను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కేటీఆర్ బతుకమ్మ పండుగను కూడా ఈవెంట్ అంటున్నాడని.. బతుకమ్మ అంటే కవిత అని చెప్పుకున్న మీరు ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ జరుగుతుంటే కవిత ఎక్కడ పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also : Saddula Bathukamma : సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతున్న సీఎం రేవంత్