Gurukulam : గురుకుల కామన్ ఎంట్రెన్స్ పరీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
గురుకులాలు అంటే... విజ్ఞాని అందించే నిది.. గురువులు కొలువుండే సన్నిధి,అజ్ఞాన అంధకారమును తొలగించే దీపమని, విజ్ఞాన కుసుమాలను ...వికసింపజేసే నందనవనమన్నారు.
- By Latha Suma Published Date - 05:11 PM, Sat - 11 January 25

Gurukulam : రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వివిధ గురుకుల సంక్షేమ హాస్టల్ లో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు సంబంధించిన పోస్టర్ ను శనివారం ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఐదవ తరగతి నుండి 9 వ తరగతి వరకు..రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ గురుకులాలలో ప్రవేశం కోసం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను వచ్చే నెల అనగా 23 ఫిబ్రవరి 2025 న నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గురుకులాలు అంటే… విజ్ఞాని అందించే నిది.. గురువులు కొలువుండే సన్నిధి,అజ్ఞాన అంధకారమును తొలగించే దీపమని, విజ్ఞాన కుసుమాలను …వికసింపజేసే నందనవనమన్నారు. గురుకులాల్లో మంచి క్రమశిక్షణ అలవర్చే కుటీరమని అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యతోపాటు మంచి పౌష్టికాహారం , బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 40% మేర మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు 200% మేర కాస్మాటిక్ చార్జీలను పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి గురుకులాలలో ఎస్సీ,ఎస్టీ,బీసీ కులాలకు చెందిన పేద,మధ్యతరగతి తో పాటు ఆర్థికంగా ఇబ్బందులు వున్న విద్యార్థులందరూ ఈ గురుకులాల్లో చేరాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరేలా, తమ లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించే గురుకులలో చేరాలని ఆయన ఆకాక్షించారు. రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాలలోనీ పాఠశాలలో, అన్ని గ్రామాలలో విస్తృతంగా ప్రచారంతో పాటు ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఆటో ద్వారా గురుకుల విశిష్టతను గూర్చి వివరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీజీఎస్ డబ్ల్యూ ఆర్ఈఐఎస్ కార్యదర్శి డా.వి.యస్.అలగు వర్షిణి వివరించారు. ఈ కార్యక్రమంలో బీసి వెల్ఫేర్ కార్యదర్శి బి. సైదులు, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి కె. సీతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.