HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dasharathi Is The Proud Child Of Telangana Nation

KCR: తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ దాశరథి

దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు.

  • Author : Balu J Date : 22-07-2023 - 11:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు శ్రీ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా సీఎం కొనియాడారు.

సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష కృషి చేసి తెలుగు భాషా సాహిత్యాన్ని దాశరథి సుసంపన్నం చేశారని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా దాశరథి కృష్ణామాచార్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడంతో పాటు, తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నదని సీఎం తెలిపారు. 2023 సంవత్సరానికిగాను శ్రీ అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.

దాశరథి కృష్ణమాచార్యుల ఆశయాల మేరకు ముందుకు సాగుతున్నామని సీఎం అన్నారు. తెలంగాణను సాధించడంలోనూ, రాష్ట్ర ప్రగతిని కొనసాగించడంలోనూ వారి స్ఫూర్తి ఇమిడి వున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక అస్తిత్వంతో, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సీఎం అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dasharathi
  • kcr
  • telangana
  • tribute

Related News

CM Revanth Reddy doesn't have that courage: KTR

KCR వ్యక్తిత్వంపై సీఎం రేవంత్ విషం చిమ్ముతున్నాడు – కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, కానీ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ ఆరోపించారు

  • Loan App Harassment

    లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

  • Telangana Rtc Bus Stand

    ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

  • Cm Revanth Municipal Electi

    మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

  • Questions Asked By Sit To K

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

Latest News

  • కస్టమర్లకు షాక్ ఇచ్చిన SBI

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

  • 1 లక్ష రూపాయల పెట్టుబడి.. 78 లక్షలయ్యింది!

  • అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

Trending News

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd