DK Aruna : డీకే అరుణ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది..?
మెజార్టీ లీడర్లు బీసీల్లోని వాల్మీకి బోయలకు టికెట్ ఇవ్వాలని డీకే అరుణ సమక్షంలో తీర్మానం చేశారు
- Author : Sudheer
Date : 24-10-2023 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికలు (2023 Telangana Elections) సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీ (Telangana BJP) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ పక్క అధికార పార్టీ బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు గెలుపు రేస్ లో ముందు ఉండి..దూకుడు కనపరుస్తుంటే..బిజెపి మాత్రం మొదటి నుండి వెనుకంజ లో ఉంది. అభ్యర్థుల ప్రకటన ఆలస్యం..ప్రచారం ఆలస్యమే కాకుండా ఇప్పుడు ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ తర్వాత కూడా వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతల పేర్లు లిస్ట్ లో లేకపోవడం తో అంత అయోమయంలో ఉండగా..ఇక ఇప్పుడు ఆ నేతలంతా పార్టీ లు మారుతున్నట్లు ప్రచారం అవుతుండడం..మరికొంతమంది పోటీ చేయడం లేదని ప్రకటిస్తుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) తో పాటు వివేక్ (Vivek) కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. ఇదిలా ఉండగానే సీనియర్ నేత డీకే అరుణ (DK Aruna) సైతం షాక్ ఇచ్చింది. ఎన్నికలలో బరిలో నిల్చోవడం లేదని ప్రకటించి షాక్ ఇచ్చింది. వాస్తవానికి గద్వాల నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తను పోటీ చేయకుండా బీసీలకే టికెట్ ఇప్పించేందుకు తన అభ్యర్థిత్వాన్ని వదులు కుంటున్నట్లు ఆమె తెలిపారు. మెజార్టీ లీడర్లు బీసీల్లోని వాల్మీకి బోయలకు టికెట్ ఇవ్వాలని డీకే అరుణ సమక్షంలో తీర్మానం చేశారు. అనంతరం ఆ తీర్మాన పత్రాన్ని హైకమాండ్ కు పంపించినట్టు తెలిపారు. బీజేపీలో డీ.కే. అరుణతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డా.కె.లక్ష్మణ్ కూడా పోటీ చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. రెండో విడుతలో వీరి పేర్లుంటాయో లేదో వేచి చూడాలి మరీ. ఒకవేళ నిజంగానే అరుణ పోటీ చేయకపోతే ఎలా ఉంటుంది..? ఇన్ని రోజులుగా అరుణనే నమ్ముకున్న కార్యకర్తలు ఆమె నిర్ణయానికి ఓకే చెపుతారా..? లేక వేరే పార్టీ కి జై కొడతారా అనేది కూడా చూడాలి.
Read Also : 5 Big Changes : త్వరలో ‘హెచ్-1బీ వీసా’ మార్పులు.. ఇండియన్స్‌పై బిగ్ ఎఫెక్ట్