Cyber Crime: సోషల్ మీడియా కార్యకలాపాలపై సైబర్ క్రైం స్పెషల్ ఫోకస్..జాగ్రత్త
Cyber Crime: నకిలీ ఖాతాల ద్వారా యువతను మోసం చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేయడం, అసభ్యకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడం
- By Sudheer Published Date - 04:54 PM, Sat - 19 April 25

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న సైబర్ నేరాల (Cyber Crimes) నేపథ్యంలో సైబర్ క్రైం పోలీసులు సోషల్ మీడియా (Social Media) కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నకిలీ ఖాతాల ద్వారా యువతను మోసం చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేయడం, అసభ్యకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడం, ఫేక్ వీడియోలను వైరల్ చేయడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం యువత సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయి.
Underworld Don: అండర్ వరల్డ్ డాన్ కుమారుడిపై కాల్పులు.. ముత్తప్ప రాయ్ ఎవరు ?
సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఖాతాల ద్వారా ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తుండటం కొత్త కాదు. అయితే కొంతమంది యూజర్లు తమ ఫేక్ కంటెంట్‌ను నిజమని నమ్మి షేర్ చేస్తూ నేరానికి పాల్పడుతున్నారు. ఇటీవల కంచె గచ్చిబౌలి భూ వివాదంపై AI టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఫేక్ పోస్టులు వైరల్ కావడం ఇందుకు ఉదాహరణ. ఈ తరహా పోస్టులు ప్రజల్లో అసంతృప్తిని పెంచడంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత రేకెత్తిస్తున్నాయి.
CM Revanth Reddy : తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాపై గట్టి నిఘా పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయబోతే దాని పరిణామాల గురించి ముందుగా ఆలోచించాలని ప్రజలకు సూచిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు, అసత్య సమాచారంతో కూడిన పోస్టులు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవలి ఘటనలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు AI ఆధారిత ఫేక్ ఇమేజ్‌ను రీట్వీట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేయడం ఈ అంశాన్ని మరింత హైలైట్ చేసింది. సోషల్ మీడియా వినియోగదారులు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.