CP Radhakrishnan : తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
- Author : Sudheer
Date : 20-03-2024 - 12:03 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఇన్‌ఛార్జ్ గవర్నర్తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్ (Telangana Governor)గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం రాజ్‌భవన్ (Raj Bhavan)లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, తమిళి సై రాజీనామాతో తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్‌గా ప్రస్తుత జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియామకమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్‌నే చూడనున్నారు. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పలు కీలక పదవులు నిర్వహించారు. 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు వారు ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే.. బీజేపీ తరపున పలు కీలక పదవులు నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
Read Also : Mohan Babu : మోడీకి సపోర్ట్‌గా మోహన్‌బాబు.. జగన్‌కు వ్యతిరేకంగా మనోజ్ కీలక వ్యాఖ్యలు