Warangal Airport : ఎయిర్ పోర్టు పేరుపై రచ్చ
Warangal Airport : వరంగల్ చరిత్రలో ప్రముఖ స్థానం దక్కించుకున్న కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి పేరును ఈ ఎయిర్పోర్ట్‌కు పెట్టాలని అక్కడి ప్రజలు మరియు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు
- Author : Sudheer
Date : 05-03-2025 - 8:51 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో మామునూరులో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్ట్(Warangal Airport)కు పేరుపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. వరంగల్ చరిత్రలో ప్రముఖ స్థానం దక్కించుకున్న కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి (Rani Rudramadevi) పేరును ఈ ఎయిర్పోర్ట్‌కు పెట్టాలని అక్కడి ప్రజలు మరియు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రుద్రమదేవి పేరు ఖచ్చితంగా ఉండాలని హ్యాష్‌ట్యాగ్ లతో ప్రచారం చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
Ropeway: యాత్రికులకు గుడ్ న్యూస్.. 9 గంటల ప్రయాణం ఇకపై 36 నిమిషాలే!
కాగా తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఈ డిమాండ్‌పై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అధికార పార్టీ తమ నిర్ణయాన్ని ఇంకా వెల్లడించనప్పటికీ, బీఆర్ఎస్ నేతలు ముందస్తుగానే తమ వైఖరిని తెలియజేస్తున్నారు. రుద్రమదేవి పేరు పెట్టకపోతే, తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక 3.5 సంవత్సరాల తర్వాత తప్పక మారుస్తామని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా ప్రకటించాయి.
వాస్తవానికి వరంగల్ చరిత్ర పరంగా రుద్రమదేవి పేరు పెట్టడం అనేక మంది ప్రజలకు ఆమోదయోగ్యమైన విషయమే. కాకతీయ రాజవంశం కాలంలో వరంగల్ కేంద్రంగా అభివృద్ధి చెందింది. రుద్రమదేవి పరిపాలనలో ఈ ప్రాంతం ఎంతో సుభిక్షంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్‌కు ఆమె పేరు పెట్టడం భావోద్వేగపూరితంగా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
SBI : వాటిని నమ్మి ఇన్వెస్ట్ చేయొద్దు – కస్టమర్లకు హెచ్చరిక
ఈ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే. రుద్రమదేవి పేరు ఖరారైతే, అది ప్రజల ఆకాంక్షల మేరకే అవుతుంది. కానీ రాజకీయ పార్టీల మధ్య ఈ అంశం అధికార పోరాటంగా మారితే, అసలు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉంది.