KCR : కేసీఆర్ నువ్వు బక్కోడివి కాదు.. బకాసురుడివి – దుబ్బాకలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ చుట్టుపక్కల పది వేల ఎకరాలను కబ్జా చేశావు.. నీవు బక్కోడివి కాదు.. మింగడానికి నీవు బకాసురుడివి
- By Sudheer Published Date - 03:33 PM, Thu - 23 November 23

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంకా నాల్గు రోజుల సమయం మాత్రమే ఉండడం తో అధికార పార్టీ తో పాటు కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) పార్టీల నేతలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేస్తూ..ప్రత్యర్థి పార్టీల ఫై విమర్శల అస్త్రాలను వదులుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)..బిఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకొని తనదైన శైలి లో కేసీఆర్ (KCR) ఫై మాటల తూటాలు వదులుతున్నారు. నేడు గురువారం దుబ్బాక (Congress Public Meeting In Dubbaka) లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్..కేసీఆర్ ఫై , బిఆర్ఎస్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ ప్రజలకు కాదు …కేసీఆర్ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ అయ్యింది.. పేదలందరూ దివాళ తీసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే కేసీఆర్ కు ఏం నొప్పి అని ప్రశ్నించారు. లక్ష కోట్లు మింగావు.. హైదరాబాద్ చుట్టుపక్కల పది వేల ఎకరాలను కబ్జా చేశావు.. నీవు బక్కోడివి కాదు.. మింగడానికి నీవు బకాసురుడివి.. ఫామ్ హౌజ్ లో ఉంటే నీవు కుంభకర్ణుడివి.. అంటూ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ లేస్తే మింగుతాడు. మింగుతే పంటాడు తప్ప.. ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకోడు.. దుబ్బాకకు పట్టిన శని ఏదైనా ఉందంటే అది కేసీఆర్ కుటుంబమే అని ఆరోపించారు. దుబ్బాకకు వచ్చే అభివృద్ధి పనులు, నిధులను సిద్దిపేట నియోజకవర్గానికి తరలించుకుపోతున్నారని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి..మెదక్ ఎంపీగా రెండుసార్లు గెలిపించినా దుబ్బాకకు ఎందుకు నిధులు తీసుకురాలేదు.. దుబ్బాకను ఎందుకు రెవెన్యూ డివిజన్ గా చేయించలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇప్పించలేదు.. డిగ్రీ కాలేజీ ఎందుకు తీసుకురాలేదు అని ప్రశ్నించారు. పేరులోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉంది కానీ.. ఆయన పాత చింతకాయ పచ్చడే అన్నారు రేవంత్.
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చాడా..? ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమైనా కృషి చేశాడా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. చెరుకు ముత్యం రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారని..అందరికీ ఆదర్శ కుటుంబంగా చెరుకు ముత్యం రెడ్డి కుటుంబం ఉందని..ఎన్నికల్లో భారీ మెజార్టీ తో చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ కోరారు.
Read Also : Telangana: హయత్‌నగర్, నాచారంలో రూ.3.20 కోట్లు స్వాధీనం