Congress : కాంగ్రెస్ పార్టీ.. క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరం – తోట కమలాకర్ ఎద్దేవా
Congress : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై కూడా మండిపడిన ఆయన
- By Sudheer Published Date - 05:23 PM, Fri - 18 July 25

తెలంగాణలో కాంగ్రెస్ పాలన (Congress Rule)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి (Thota Kamalakar Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ కంటే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని గుంతల రోడ్ల రోజులకు తీసుకెళ్లుతోందని ఆరోపించారు. గ్రామాల్లో బీటీ రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారి పరిస్థితిని సరిచేయకపోతే ప్రజలు కాంగ్రెస్‌ను తీరుగా బహిష్కరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
Rishabh Pant : రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధం..
బీటీ రోడ్ల మరమ్మతులపై అక్బర్‌పేట నుండి మిరుదొడ్డి మండలం కాసులాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించిన కమలాకర్ రెడ్డి, ప్రజలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతుల అవసరాలను గుర్తించకుండా, బెల్టుషాపుల ఏర్పాటుకు ముందుంటున్నారని మండిపడ్డారు. పాలనలో బాధ్యతలతో కాకుండా, మద్యం విక్రయాల మీదే ఆసక్తి చూపిస్తున్నారని విమర్శించారు.
Kitty Party Aunty : రేవంత్ రెడ్డి ని కిట్టీ పార్టీ ఆంటీతో పోల్చిన కేటీఆర్
అలాగే బీఆర్‌ఎస్‌పై నిత్యం అసత్య ఆరోపణలు చేస్తూ పరిపాలన వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తోట కమలాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై కూడా మండిపడిన ఆయన, రైతుల సమస్యలపై ఏ మాత్రం పట్టించుకోకుండా పార్టీ స్టేజులపై కూర్చోవడమే ఆయన పనిగా మారిందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చిదుర్లు కావడంపై స్పందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన ఓటమి తెచ్చిపెడుతుందన్నారు.