IIFA Awards 2025: ‘లాపతా లేడీస్’కు 10 ‘ఐఫా’ అవార్డులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
అత్యధిక అవార్డులు(IIFA Awards 2025) ఈ మూవీకే దక్కడం విశేషం.
- By Pasha Published Date - 11:22 AM, Mon - 10 March 25

IIFA Awards 2025: ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ’ అవార్డ్స్ (IIFA) వేడుకలు రాజస్థాన్‌లోని జైపూర్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈసారి ‘ఐఫా’ అవార్డుల్లో కిరణ్ రావు డైరెక్షన్‌లో వచ్చిన సామాజిక కథా చిత్రం ‘లాపతా లేడీస్’ ఏకంగా 10 అవార్డులను సొంతం చేసుకుంది. అత్యధిక అవార్డులు(IIFA Awards 2025) ఈ మూవీకే దక్కడం విశేషం.
‘లాపతా లేడీస్’ సాధించిన 10 అవార్డులు ఇవే..
- ఉత్తమ చిత్రం – లాపతా లేడీస్
- ఉత్తమ హీరోయిన్ – నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)
- ఉత్తమ దర్శకత్వం – కిరణ్ రావు (లాపతా లేడీస్)
- సహాయక పాత్రలో ఉత్తమ ప్రదర్శన (పురుషుడు) – రవి కిషన్ (లాపతా లేడీస్)
- పాపులర్ కేటగిరీలో ఉత్తమ కథ (ఒరిజినల్) – బిప్లబ్ గోస్వామి (లాపతా లేడీస్)
- బెస్ట్ డెబ్యూ (మహిళ) – ప్రతిభా రంతా (లాపతా లేడీస్)
- ఉత్తమ సంగీత దర్శకుడు – రామ్ సంపత్ (లాపతా లేడీస్)
- ఉత్తమ సాహిత్యం – ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్ మూవీ టీమ్‌కు చెందిన సజ్ని)
- ఉత్తమ ఎడిటింగ్ – జబీన్ మర్చంట్ (లాపతా లేడీస్)
- ఉత్తమ స్క్రీన్ ప్లే – స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)
Also Read :Shock To Lalit Modi: భారత్ ఎఫెక్ట్.. లలిత్ మోడీకి వనౌతు పాస్‌పోర్ట్ రద్దు
‘ఐఫా’లో ఇతరులు సాధించిన అవార్డులు..
- ఉత్తమ హీరో – కార్తీక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)
- ఉత్తమ విలన్ – రాఘవ్ జుయల్ (కిల్)
- సహాయక పాత్రలో ఉత్తమ ప్రదర్శన (స్త్రీ) – జాంకీ బోడివాలా (షైతాన్)
- ఉత్తమ కథ (అడాప్టెడ్) – శ్రీరామ్ రాఘవన్, అరిజిత్ బిస్వాస్, పూజా లధా సూర్తి, అనుకృతి పాండే (మెర్రీ క్రిస్మస్)
- ఉత్తమ దర్శకుడు (డెబ్యూ) – కునాల్ కెమ్ము (మడ్గావ్ ఎక్స్‌ప్రెస్)
- ఉత్తమ అరంగేట్రం (పురుషుడు) – లక్ష్య లాల్వాని (కిల్)
- ఉత్తమ గాయకుడు (పురుషుడు) – జుబిన్ నౌతియాల్ (ఆర్టికల్ 370 నుంచి దువా)
- ఉత్తమ గాయని (మహిళ) – శ్రేయా ఘోషాల్ (భూల్ భూలయా 3 నుంచి అమీ జే తోమర్ 3.0)
- ఉత్తమ సౌండ్ డిజైన్ – సుభాష్ సాహూ, బోలోయ్ కుమార్ డోలోయ్, రాహుల్ కర్పే (కిల్)
- ఉత్తమ డైలాగ్ – అర్జున్ ధావన్, ఆదిత్య ధర్, ఆదిత్య సుహాస్ జంభలే, మోనాల్ థాకర్ (ఆర్టికల్ 370)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ – రఫే మహమూద్ (కిల్)
- ఉత్తమ కొరియోగ్రఫీ – బోస్కో సీజర్ (బాడ్ న్యూజ్ నుంచి తౌబా తౌబా)
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ (భూల్ భూలయ్యా 3)
- భారతీయ సినిమాలో అత్యుత్తమ విజయం – రాకేష్ రోషన్