Fee Reimbursement: కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తుంది – కవిత
Fee Reimbursement: విద్యార్థుల చదువులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా అమ్మాయిల చదువులను కాలరాస్తోందని ఆమె ఆరోపించారు
- By Sudheer Published Date - 11:49 AM, Mon - 15 September 25

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt )పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల చదువులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా అమ్మాయిల చదువులను కాలరాస్తోందని ఆమె ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కావాలనే ఎగ్గొడుతోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసిందని ఆమె గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆమె విమర్శించారు.
కమీషన్ల కోసం ఒత్తిడి
ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కమీషన్లు డిమాండ్ చేస్తోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. బకాయిలు చెల్లించాలంటే 20 శాతం కమీషన్లు ఇవ్వాలని ప్రభుత్వంలోని కొందరు అధికారులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశాయని ఆమె తెలిపారు. ఈ కమీషన్ల వ్యవహారం కారణంగా బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆమె పేర్కొన్నారు.
అడబిడ్డల చదువుకు అడ్డంకి
“ఇందిరమ్మ రాజ్యం” అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల చదువుకు అడ్డంకిగా మారిందని కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆడపిల్లలను చదువుకు దూరం చేసి, వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెస్తూ, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆమె కోరారు. లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని ఆమె హెచ్చరించారు.
Winter : ఈసారి మరింత వణికిపోతారు – నిపుణులు