HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Good News To Generalist

Congress Abhaya Hastham : జర్నలిస్టులఫై కాంగ్రెస్ వరాల జల్లు

‘అభయ హస్తం' పేరుతో 42 పేజీల్లో, 62 ప్రధాన అంశాలతో కూడిన మేనిఫెస్టో ను రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టో లో జర్నలిస్టులఫై వరాలజల్లు కురిపించింది.

  • Author : Sudheer Date : 17-11-2023 - 3:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Good News To Gener
Congress Good News To Gener

టి కాంగ్రెస్ (T Congress) సామాన్య ప్రజలకే కాదు జర్నలిస్టులఫై కూడా వరాల జల్లు కురిపించింది. శుక్రవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో 2023 ని రిలీజ్ చేసింది. ‘అభయ హస్తం’ (Abhaya Hastham) పేరుతో 42 పేజీల్లో, 62 ప్రధాన అంశాలతో కూడిన మేనిఫెస్టో ను రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టో లో జర్నలిస్టులఫై వరాలజల్లు కురిపించింది.

We’re now on WhatsApp. Click to Join.

మేనిఫెస్టో (Abhaya Hastham)లో తెలిపిన హామీలు..

  • రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు..
  • సుదీర్ఘ కాలంగా పెండిగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడం. అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇళ్ల స్థలాలు కేటాయించడం.
  • మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5లక్షల నగదు ఆర్థిక సహాయం
  • రిటైర్ అయిన జర్నలిస్టులకు పింఛన్
  • ‘జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్’ ను జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందేలా హెల్త్ కార్డులు జారీ చేయడం వంటి అంశాలను టీ- కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది.

మేనిఫెస్టోలో తెలిపిన ప్రధాన అంశాలు :-

  • ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కార్యాలయంలో ప్రతి రోజూ ‘ప్రజా దర్బార్’ నిర్వహణ. ఎమ్మెల్యేలు ఆయాా నియోజక వర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహణ
  • రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, భూమితో ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు. భూమి లేని ఉపాధి రైతుల కూలీలకు ఏడాదికి రూ.12 వేలు. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు. మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి, పసుపు బోర్డు ఏర్పాటు.
  • పంట బీమా MGNREGSలో వ్యవసాయ పనుల అనుసంధానం, పంట నష్టపోతే వెంటనే పరిహారం అందేలా పంట బీమా పథకం
  • ‘ధరణి’ స్థానంలో భూమాత పోర్టల్ సరికొత్త రెవెన్యూ వ్యవస్థ, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు.
  • రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు
  • తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన యువతను అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అలాగే తల్లి/తండ్రి/భార్యకు రూ.25 వేల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్.
  • ఉద్యమంలో పాల్గొన్న యువతపై కేసుల ఎత్తివేత, జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు
  • తొలి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తొలి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాకలాగ్ ఉద్యోగాల భర్తీ
  • ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్, సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తి
  • నిరుద్యోగ యువతకు ప్రతీ నెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి, ప్రత్యేక చట్టంతో టీఎస్ పీఎస్సీ పూర్తి ప్రక్షాళన, యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ.
  • ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ప్రభుత్వ రాయితీలు పొందే ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్లు
  • విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా యూత్ కమిషన్, రూ.10 లక్షల వరకూ వడ్డీ లేని రుణ సదుపాయం.
  • గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు, ఏజెంట్ల నియంత్రణ కోసం ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటు. మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, EWS వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ సహా పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు.
  • ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్శిటీల ఏర్పాటు, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా 4 నూతన ట్రిపుల్ ఐటీల ఏర్పాటు.
  • అమెరికాలో ఐఎంజీ అకాడమీ తరహాలోనే ప్రపంచ స్థాయి క్రీడా విశ్వ విద్యాలయం ఏర్పాటు
  • పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ ల్లో 2 విద్యాలయాల ఏర్పాటు, 6 నుంచి పట్టభద్రులయ్యే వరకూ నాణ్యమైన విద్య అందించడం
  • 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతీ విద్యార్థిని ఎలక్ట్రిక్ స్కూటీ అందజేత
  • ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు, రిజర్వేషన్లలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ అమలుకై గట్టి చర్యలు
  • అంబేడ్కర్ అభయ హస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం
  • ఇళ్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ.6 లక్షలు అందజేత
  • ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో అప్పగింత, అర్హులందరికీ పోడు భూముల పట్టాల పంపిణీ
  • సమ్మక్క, సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా, గ్రామ పంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు
  • ఎస్సీ కార్పోరేషన్లకు రూ.750 కోట్ల నిధులు మంజూరు, 3 ఎస్టీ కార్పోరేషన్లు ఏర్పాటు
  • నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ ల్లో 5 కొత్త ఐటీడీఏల ఏర్పాటు. అన్ని కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల స్థాపన
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు టెన్త్ పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష అందజేత. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేస్తే యువతకు రూ.5 లక్షలు అందజేత.
  • ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, విదేశాల్లో యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయ అందజేత
  • ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపు కుల గణన, మైనార్టీలు టెన్త్ పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25 వేలు, పీజీ పాసైతే రూ.లక్ష. ఉర్దూ మీడియం పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ
  • దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూ.6 వేలు, అంగన్వాడీ టీచర్లకు నెల వేతనం రూ.18 వేలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల
  • వేతనం, 50 ఏళ్లు నిండిన జానపద కళాకారులకు నెలకు రూ.3 వేల పెన్షన్
  • రేషన్ డీలర్స్ కు రూ.5 వేల గౌరవ వేతనం, మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ.5 లక్షల నగదు.
  • మత బోధకులకు రూ.10 వేల – రూ.12 వేల గౌరవ వేతనం, వధువులకు రూ.1.6 లక్షల సాయం

Read Also : 3000 New Trains : 3వేల కొత్త రైళ్లు.. 1000 కోట్ల మంది ప్రయాణికులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhaya Hastham
  • congress
  • Generalist
  • T-Congress Manifesto 2023

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

    Latest News

    • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

    • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

    • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

    • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

    • Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd