Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. వారికి పదవులు కష్టమే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
- Author : Gopichand
Date : 13-12-2023 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఏడాది కాలం పాటు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వరాదని స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో 55 మందికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 118 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. 118 స్థానాల్లో 65 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా మిగిలిన 54 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు విజయం సాధించాయి.
అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయి 55 మంది నాయకులు ఏడాది పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ఏ పోస్టులలో ఉండరాదని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు గాని ఈ 55 మందికి ఇవ్వకూడదని పేర్కొంది. అయితే మైనార్టీ ప్రజాప్రతినిధులు గెలవకపోవడంతో అర్హత కలిగిన నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తుంది.
Also Read: Minister Komatireddy: మంత్రి కోమటిరెడ్డికి స్వల్ప అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల సీట్ల కోసంచాలామంది నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేసిన నాయకులతో పాటు, టికెట్లు త్యాగం చేసిన నేతలు కూడా ఈసారి పదవులను ఆశిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి కూడా సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరే ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ పదవి ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకోవాలని పార్టీ అధిష్ఠానం సూచించింది. పీసీసీ పదవి కోసం మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్ పోటీ పడుతున్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.