HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Comprehensive Caste Enumeration Survey Of Households In Telangana Is A Success Draft Report In Two Days Cm Revanth

Caste Survey : కులగణన సర్వే తుది నివేదిక.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Caste Survey) మాట్లాడారు.

  • By Pasha Published Date - 06:24 PM, Wed - 29 January 25
  • daily-hunt
CM Revanth

Caste Survey : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుల గణన సర్వేపై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఇవాళ  సమీక్షించారు.  ఈ సర్వే యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేపై జాతీయ స్థాయి నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Caste Survey) మాట్లాడారు.

Also Read :Union Budget Facts : బ్లాక్ బడ్జెట్, చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్.. భారత బడ్జెట్ విశేషాల చిట్టా ఇదిగో

త్వరలోనే ముసాయిదా నివేదిక సమర్పణ

సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. ఈ కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని రేవంత్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్‌కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని చెప్పారు. సర్వే ద్వారా సేకరించిన వివరాల డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో దాని ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి ఈసందర్భంగా వివరించారు. కొన్నిచోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించడం, కొన్ని ఇళ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటంతో కొన్ని కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2లోగా రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,  మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read :Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్

కులగణన సర్వే గురించి..

  • 2024 సంవత్సరం నవంబర్ 6న రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే 2024) మొదలైంది.
  • అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది.
  • రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించింది. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Caste Enumeration Survey
  • Caste Survey
  • cm revanth
  • congress
  • House To House Survey
  • telangana

Related News

Telangana Food Menu

Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

Telangana Global Summit 2025 : ఈ సమ్మిట్‌లో పాల్గొనే విదేశీ మరియు దేశీయ ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతిని, ముఖ్యంగా ఇక్కడి రుచికరమైన వంటకాలను పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

  • 2015 Group 2 Rankers

    Group-2 Rankers : 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

  • Krishna Water Dispute

    Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!

  • Election Schedule

    Telangana Grama Panchayat Elections : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

  • Group-1 Candidates

    CM Revanth District Tour : జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్న సీఎం రేవంత్

Latest News

  • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

  • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

  • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

  • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd