HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanths Key Meeting On Krishna And Godavari Waters

CM Revanth Key Meeting: కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీల‌క స‌మావేశం!

రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది.

  • Author : Gopi Date : 30-11-2024 - 7:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Key Meeting
CM Revanth Key Meeting

CM Revanth Key Meeting: ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష (CM Revanth Key Meeting) నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థతి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు.

రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది. త్వరలోనే ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుందని, ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, ఏయే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను ఇప్పటికే ట్రిబ్యునల్కు సమర్పించారు.. జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట పకడ్బందీగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం నదీ పరివాహక ప్రాంతాన్ని బట్టి అదే దామాషా ప్రకారం నీటి కేటాయింపులుండాలి. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా.. ఏపీలో కేవలం 30 శాతం ఉంది. అదే వాదనల ప్రకారం 1005 టీఎంసీల్లో 70 శాతం నీటి వాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నందున, వాటికి బదెలెగా నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపులున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ నీటి వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ ఇప్పటివరకు పూర్తి చేయనందున, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు గోదావరి, కృష్ణా బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Also Read: Champions Trophy 2025: ఐసీసీ, బీసీసీఐ ముందు తలవంచిన పాకిస్థాన్!

వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఏపీ తరలిస్తోందని చర్చ జరిగింది. నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలీ మెట్రీ విధానంతో దీనికి అడ్డుకట్ట వేసే వీలుందని అధికారులు సీఎంకు వివరించారు. టెలీ మెట్రీ పరికరాలకయ్యే రూ.12 కోట్లు రెండు రాష్ట్రాలు చెరి సగం చెల్లించాలని అధికారులు సీఎంకు వివరించారు. అవసరమైతే మొత్తం డబ్బులు ముందుగా భరించి టెలీమెట్రీ అమల్లోకి తీసుకురావాలని, ఏపీ ఇచ్చినప్పుడు రీయింబర్స్ చేసుకోవాలని సీఎం సూచించారు. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని ఆదేశించారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బంకంచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీ నివా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చేయాలని చెప్పారు.

సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు అవసరమైన పనులన్నీ తొందరగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటివరకు ఉన్న జీవోలు, తీర్పులే కాకుండా.. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్లు, అప్పటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. వీటి ఆధారంగా అన్ని వేదికలపై తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా సమర్థమైన వాదనలు వినిపించాలని సూచించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ వైద్యనాథన్, ఏజీ సుదర్శన్రెడ్డి, అడిషనల్ ఏజీ రజనీకాంత్ రెడ్డి, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖుష్ వోరా, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్రాజ్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brajesh Kumar Tribunal
  • cm revanth
  • CM Revanth Key Meeting
  • CM Revanth Reddy
  • Godavri River
  • Irrigation projects
  • Krishna river
  • telangana
  • telugu news
  • Water Issue

Related News

Massive arrangements for the Farmers' Blessing Meeting

Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd