Free Bus Scheme : బడి పిల్లల ఆనందం చూసి ముచ్చటపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు పున:ప్రారంభం కావడం తో స్కూల్ , కాలేజీ లకు వెళ్లే ఆడ పిల్లలు సైతం ఆధార్ కార్డు చూపించి ఫ్రీ గా బస్సు లో వారి స్కూల్స్ , కాలేజీలకు వెళ్తున్నారు
- By Sudheer Published Date - 12:53 PM, Fri - 14 June 24

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పథకానికి (Free Bus Scheme) మహిళలు బ్రహ్మ రథం పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుండి పండుముసలి వారి వరకు రాష్ట్ర మొత్తం ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు లో ఫ్రీ గా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం తో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు పున:ప్రారంభం కావడం తో స్కూల్ , కాలేజీ లకు వెళ్లే ఆడ పిల్లలు సైతం ఆధార్ కార్డు చూపించి ఫ్రీ గా బస్సు లో వారి స్కూల్స్ , కాలేజీలకు వెళ్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోషల్ మీడియా ద్వారా పిల్లలకు ఫ్రీ గా బస్సు ప్రయాణం చేస్తూ చదువుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే…ఎంతో ఆనందం గా ఉందంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు.
సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది…
ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు.
ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల… pic.twitter.com/rZs03J38wG
— Revanth Reddy (@revanth_anumula) June 14, 2024
Read Also : Peddapalli: తెలంగాణలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం