HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Released The Fourth Loan Waiver

Fourth Phase Of Farmer Loan Waiver : నాలుగో విడుత రుణమాఫీని విడుదల చేసిన సీఎం రేవంత్

fourth loan waiver : మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధుల‌ను విడుదల చేశారు. రుణ‌మాఫీలో నెల‌కొన్న టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి నిధుల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు

  • Author : Sudheer Date : 30-11-2024 - 9:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revanth Released The Fou
Cm Revanth Released The Fou

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాలుగో విడత రుణమాఫీ (Fourth Phase Of Farmer Loan Waiver)ని విడుదల చేశారు. మహబూబ్​నగర్​లో రైతు పండుగ (Rythu Panduga Celebrations) ముగింపు వేడుక లో ఈ నిధులను విడుదల చేసి రైతుల్లో సంతోషం నింపారు. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధుల‌ను విడుదల చేశారు. రుణ‌మాఫీలో నెల‌కొన్న టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి నిధుల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రుణ‌మాఫీ జ‌ర‌గ‌ని 3.14 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల‌లోకి ఈ నిధులు జ‌మ అవుతాయ‌ని తెలిపారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటివరకూ రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని.. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. ‘సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కోసం ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి.. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు వలస వెళ్లాయి. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేసిందా.?. ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే.. రూ.500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఇది. అన్నదాతలకు ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీది.’ అని రేవంత్ తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను అమ్మి రుణమాఫీ చేసిందని, అది కూడా రూ.11 వేల కోట్లే అని ఆరోపించారు సీఎం రేవంత్. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే రాష్ట్రంలోని 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. ఏడాది పాలనలో రైతుల కోసం రూ. 54 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు దఫాలుగా మాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఒకవేళ కేసీఆర్ తొలి ఏడాది రుణమాఫీ చేసి ఉంటే వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండాపోయేదన్నారు. రుణమాఫీపై ప్రధాని మోదీ, కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతు బీమా, మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు ఏమిటో తనకు తెలుసన్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Arvind Kejriwal : ఢిల్లీలో కేజ్రీవాల్‌పై లిక్విడ్‌ దాడి.. నిందితుడు అరెస్ట్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fourth loan waiver
  • loan waivers
  • telangana farmers
  • telangana government

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd