HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddys Team Reached America

CM Revanth Reddy : అమెరికాలో సీఎం రేవంత్ కు ఘనస్వాగతం

పెట్టుబడుల నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు

  • Author : Sudheer Date : 04-08-2024 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Revanth Us
Cm Revanth Us

అమెరికా (America ) కు చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఘన స్వాగతం లభించింది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకురావడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. న్యూయార్క్‌లో రేవంత్‌రెడ్డి బృందానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్‌లో ఈరోజు ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొనబోతున్నారు. సీఎం వెంట ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి సహా పలువురు అధికారులు ఉన్నారు. పెట్టుబడుల నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

10 రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికాతో పాటు, ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. అమెరికా నుండి నేరుగా ద‌క్షిణ కొరియా వెళ్తారు. అనంత‌రం అక్క‌డ ప‌ర్య‌ట‌న ముగించుకొని తిరిగి సీఎం బృందం ఈ నెల 14వ తేదీన ఉద‌యం హైద‌రాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. ఈ పది రోజుల ప‌ర్యాట‌న‌లో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 06 న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మిగతా ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది రేవంత్ టీమ్.

పర్యటన లో భాగంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా చర్చ‌లు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని అంత‌ర్జాతీయ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. వీరిలో ప్ర‌ముఖంగా అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కాగ్నిజెంట్‌ సీఈవో, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ సీవోవో, పెప్సీ కో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వారు ఉన్నారు.

Read Also : Train Fare Concessions: సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలలో ప్రత్యేక తగ్గింపు లభిస్తుందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • CM Revanth Reddy
  • revanth America tour

Related News

Revanth Reddy, Allu Arjun

అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy  అల్లు సినిమాస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్‌లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీల్లో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ వంటి చిత్రాల వసూళ్లతో పోటీపడాలని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ

  • Iranian President Masoud Pezeshkian

    యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Gold Deal

    అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

Latest News

  • భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd