Telangana Formation Day : కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ
వ్యక్తిగత ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రిక ను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ కు, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం సూచించారు
- By Sudheer Published Date - 08:12 PM, Thu - 30 May 24

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు (Telangana Formation Day) మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆహ్వాన లేఖ పంపారు. వ్యక్తిగత ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రిక ను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ కు, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రావడం తో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది.
ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూన్ 2న ఉదయం 9.30గంటలకు గన్‌పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఈ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా లేఖ రాసారు సీఎం రేవంత్ రెడ్డి.
We’re now on WhatsApp. Click to Join.
జూన్ 2న ఉదయం 9.30గంటలకు గన్‌పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పెరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగం, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తున్నారు.
Read Also : Tollywood : పవన్ కళ్యాణ్ నిర్మాత ఇంట విషాదం..