CM Revanth Reddy: మీడియాకు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ భేటీ జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 21-06-2024 - 9:16 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Reddy: ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రివర్గ భేటీ జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో రైతు పంట రుణమాఫీపై నిన్ఱయం తీసుకున్నారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల వరకు అన్ని పంట రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులు అందరితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాకు పలు సూచనలు ఇచ్చారు రేవంత్.
పత్రికలు ఇష్టం వచ్చినట్లు రాస్తమంటే కుదరదని హెచ్చరించారు సీఎం రేవంత్. ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడానికి మీడియా ఏదేదో రాస్తుంది. కాబట్టి మంత్రి వర్గ నిర్ణయాలను, ప్రభుత్వ పరిపాలనకు సంబందించిన అంశాలను మీడియాకు వివరించడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీదర్ బాబులను అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీదర్ బాబులు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారంగా ఉంటుందని సీఎం చెప్పారు. కానీ పక్షంలో మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తే కఠిన చర్యలకు ప్రభుత్వం వెనుకాడబోదని హెచ్చరించార.
Also Read: SweetPotato Gulabjamun : చిలగడదుంపలతో గులాబ్ జామూన్.. టేస్ట్ యమ్మీ