HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Cm Revanth Reddy Warns Fake Journalists That From Now On They Will Be Beaten With Rags

CM Revanth : గుడ్డలూడదీసి కొడతాం.. ఫేక్ జర్నలిస్టులకు సీఎం వార్నింగ్

మీకు కుటుంబాలు లేవా? భార్య పిల్లలు లేరా?’’ అని రేవంత్ (CM Revanth)  ఫైర్ అయ్యారు.

  • By Pasha Published Date - 06:26 PM, Sat - 15 March 25
  • daily-hunt
Rajiv Yuva Vikasam Scheme
Rajiv Yuva Vikasam Scheme

CM Revanth :  తెలంగాణలోని ఫేక్ జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ జర్నలిస్టులు ముసుగు వేసుకొని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతామని ఆయన హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్నందున.. ప్రస్తుతం తాను, తనలాంటి బాధిత నేతలు ఓపిక పడుతున్నట్లు తెలిపారు. ‘‘సీఎం హోదాలో ఉన్నంత మాత్రాన అన్నీ భరిస్తూ కూర్చోను. చట్టప్రకారం అన్నీ చేస్తా. చట్టాన్ని దాటను’’ అని రేవంత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం గురించి, నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తోడ్కలు తీస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సోషల్‌ మీడియా వేదికగా పలువురి నీచ వ్యాఖ్యల వ్యవహారంపై స్పందిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read :Jwala Gutta : నితిన్‌తో ఐటమ్ సాంగ్.. మోకాలి వరకు డ్రెస్‌.. గుత్తా జ్వాల కామెంట్స్

కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు

‘‘కేసీఆర్ మీ పిల్లలకు చెప్పు. వాళ్లు హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాం. నాకు చికాకు వచ్చి ఒక్కమాట చెబితే మా పిల్లలంతా వారిని బట్టలు విప్పి కొడతారు’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘నేను ఉన్నంతకాలం నిటారుగా, నిఖార్సుగా ఉంటా. ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోను’’ అని ఆయన తెలిపారు. ‘‘కొంతమంది మా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదు’’ అని సీఎం చెప్పారు. ‘‘ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా?’’ అని ఆయన ప్రశ్నించారు.

Also Read :Cash For Bed Rest: బెడ్ రెస్ట్ ఆఫర్.. 10 రోజులకు రూ.4.70 లక్షలు

జర్నలిస్టు అంటే ఎవరు.. నిర్వచనం ఇవ్వండి

‘‘నేను జర్నలిస్టు సంఘాలను కోరుతున్నాను.. జర్నలిస్టు అంటే ఎవరు అనే దానికి ఒక నిర్వచనం ఇవ్వండి.. జర్నలిస్టుల ధ్రువీకరణకు ప్రమాణం ఏమిటో చెప్పండి.. ఆ ప్రమాణం లేని వాళ్లను క్రిమినల్స్‌గా పరిగణిస్తాం. ఏది పడితే అది మాట్లాడితే గుడ్డలు ఊడదీసి కొడతాం’’ అని రేవంత్ ఆగ్రహంతో చెప్పారు. ‘‘ఐ అండ్ పీఆర్ శాఖ వారికి నా రిక్వెస్టు. ఈవిషయంలో జర్నలిస్టు సంఘాలతో చర్చించండి. జర్నలిస్టుల గుర్తింపునకు అవసరమైన నిర్దిష్ట ప్రమాణాన్ని తేల్చండి’’ అని ఆయన సూచించారు.  ‘‘ఐ అండ్ పీఆర్ ఆమోదం..  డీఏవీపీ పత్రికలు, ప్రసారా సాధనాలున్నవారే జర్నలిస్టులా? లేక యూట్యూబ్ పెట్టుకుని ఏదిపడితే అది మాట్లాడే వారు జర్నలిస్టులా ? మాకు జర్నలిస్ట్ సంఘాల నాయకులే క్లారిటీ ఇవ్వాలి. నాకు రక్తం మరుగుతోంది. మీకు కుటుంబాలు లేవా? భార్య పిల్లలు లేరా?’’ అని రేవంత్ (CM Revanth)  ఫైర్ అయ్యారు.

దారుణమైన బూతులు ఉంటున్నాయి

‘‘తెలంగాణ సమాజం ఇదేనా? రజకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదురించి నిలబడిన వాడు మొనగాడు. అలాంటి ప్రాంతాన్ని నాశనం చేసి, విష సంస్కృతిని ఉసిగొల్పాలని చూస్తే ఉరికిచ్చి కొడతాం’’ అని సీఎం తేల్చి చెప్పారు. ‘‘జైలుకు పోతే బెయిల్ వస్తదని అనుకుంటే చట్టాలను సవరిస్తాం. ఆడపిల్లల ఫ్లాట్ ఫామ్‌లో దారుణమైన బూతులు ఉంటున్నాయి. వీటిని క్షమించే ప్రసక్తే లేదు’’ అని రేవంత్ తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • CM Revanth Reddy
  • Fake Journalists
  • social media
  • telangana

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • Cm Revanth Kamareddy

    CM Revanth Kamareddy Tour : నిజమైన నాయకత్వానికి నిదర్శనం సీఎం రేవంత్ ..ఎందుకో తెలుసా..?

  • CM Revanth Reddy offers special prayers to Khairatabad Bada Ganesh

    Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

Latest News

  • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd