Cash For Bed Rest: బెడ్ రెస్ట్ ఆఫర్.. 10 రోజులకు రూ.4.70 లక్షలు
బెడ్ రెస్ట్(Cash For Bed Rest) తీసుకోవాలని భావించే ఔత్సాహికులకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ఈ ఆఫర్‌ను ఇస్తోంది.
- By Pasha Published Date - 03:08 PM, Sat - 15 March 25

Cash For Bed Rest: బెడ్ రెస్ట్.. అనేది ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడే అవసరం. బెడ్ రెస్ట్ తీసుకుంటే.. జేబులో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. బెడ్ రెస్ట్ అయిపోయాక మళ్లీ డబ్బులను పోగు చేసుకునేందుకు రెట్టింపు రేంజులో చెమట చిందించాల్సి వస్తుంది. అయితే అక్కడ బెడ్ రెస్ట్ తీసుకొని తాపీగా తింటే చాలు. 10 రోజులకు రూ.4.70 లక్షలు లెక్కన జేబులో పెడతారు. బంపర్ ఆఫర్ కదూ. వివరాలివీ..
Also Read :214 Hostages Killed: 214 మంది బందీలను చంపాం.. ‘రైలు హైజాక్’పై బీఎల్ఏ ప్రకటన
అన్నీ బెడ్‌పైనే.. అన్నీ బెడ్ దగ్గరికే..
ఈ బెడ్ రెస్ట్ ఆఫర్ వెనుక పెద్ద లక్ష్యమే ఉంది. బెడ్ రెస్ట్(Cash For Bed Rest) తీసుకోవాలని భావించే ఔత్సాహికులకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ఈ ఆఫర్‌ను ఇస్తోంది. దీనికి ఓకే చెప్పేవాళ్లు 10 రోజుల పాటు బెడ్‌పైనే ఉండాలి. వివిధ రకాల రుచికర పౌష్టికాహారాలను నోటి దగ్గరికే తీసుకొచ్చి ఇస్తారు. మూత్ర విసర్జన, మలవిసర్జన అన్నీ బెడ్ పైనుంచే చేయాలి. ఇందుకోసం అత్యాధునిక వసతులతో కంఫర్టబుల్ ఏర్పాట్లు చేస్తారు. ఎటువంటి అలర్జీలు లేని వారు బెడ్ రెస్ట్ ఆఫర్‌కు అర్హులు. ఏ ఫుడ్ ఇచ్చినా తినే వాళ్లను మాత్రమే దీనికి ఎంపిక చేస్తారు. స్పేస్ జర్నీ చేసే క్రమంలో మనిషి శరీరంపై పడే ప్రభావాలను అంచనా వేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ఈ ప్రయోగం చేస్తోంది. కొంతమంది వలంటీర్లతో దీనికి సంబంధించిన ట్రయల్స్‌ను ఫ్రాన్స్‌లోని మెడెస్ స్పేస్ క్లినిక్‌లో నిర్వహిస్తున్నారు.
Also Read :Mamnoor Airport : నిజాం వర్సెస్ భారత సైన్యం.. మామునూరు ఎయిర్‌పోర్ట్ చారిత్రక విశేషాలు
తల, చేతులు మాత్రమే..
ఈ ప్రయోగం కోసం ఫ్రాన్స్‌లోని మెడెస్ స్పేస్ క్లినిక్‌లో వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో ప్రత్యేక బాత్ టబ్‌లను నిర్మించారు. వాటిలోనే వలంటీర్లు 10 రోజుల పాటు పడుకొని ఉండాలి. ఈ టబ్‌లలో రెస్ట్ తీసుకుంటే.. నీటిలో తేలియాడుతున్నట్టు ఉంటుంది. అయితే ఎవరికీ తడి అంటదు. వలంటీర్ల తల, చేతులు మాత్రమే పైకి ఉంటాయి. మిగతా శరీరమంతా టబ్ లోపలే ఉంటుంది. ఈ బాత్ టబ్‌లకు నలువైపులా చక్రాలు ఉంటాయి. వలంటీర్లలో ఎవరికైనా మల విసర్జన లేదా మూత్ర విసర్జన వస్తే.. ఆ బాత్ టబ్‌ను నేరుగా మరుగుదొడ్డి లేదా మూత్రశాలకు తీసుకెళ్తారు. కేవలం భోజనం తినేటప్పుడు వలంటీర్ మెడ దగ్గర ఒక దిండు పెడతారు. ఒక తేలియాడే బోర్డుపై ఆహారాన్ని వలంటీర్ ఎదుట ఉంచుతారు. వలంటీర్లు ఫోన్‌లో తమ వారితో మాట్లాడుకోవచ్చు. వలంటీర్లు 10 రోజుల పాటు ఇలా బెడ్ రెస్ట్‌తో గడిపాక.. ఎలాంటి ఫీలింగ్ కలిగింది ? ఆరోగ్యం ఎలా ఉంది ? ఆరోగ్యంపై పడిన ప్రభావం ఎంత ? ఆకలి ఎలా ఉంది ? వంటి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటారు.