Rythu Nestham : ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్
- By Sudheer Published Date - 02:15 PM, Wed - 6 March 24
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి ఎన్నికల హామీలను నెరవేరుస్తూ..ప్రజల అవసరాలు తీస్తూ ప్రజా సీఎం గా గుర్తింపు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు నేస్తం (Rythu Nestham) పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇది రైతుల సమస్యలు పరిష్కరించే వినూత్న కార్యక్రమం అని అభివర్ణించారు. రైతు నేస్తంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయనుంది.
We’re now on WhatsApp. Click to Join.
దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రూ. 4.07 కోట్లను ఈ కార్యక్రమానికి ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపవచ్చన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చని చెప్పుకొచ్చారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం అమలవుతుందని పేర్కొన్నారు.
Read Also : Faith Torres: ఈ దేశ సుందరి మిస్ వరల్డ్ అవుతుందా..? ఎవరీ ఫెయిత్ టోర్రెస్..?