HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >10 Hyderabadis Killed In Saudi Accident

Tragic Saudi Bus Crash : సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. రేవంత్ దిగ్భ్రాంతి

Tragic Saudi Bus Crash : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు కూడా ఉండొచ్చనే సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం

  • Author : Sudheer Date : 17-11-2025 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
Cm Revanth Reddy

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు కూడా ఉండొచ్చనే సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మక్కా నుంచి మదీనా వైపు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్‌ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 మందికి పైగా సజీవ దహనమయ్యారని సౌదీ స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో గణనీయ సంఖ్యలో హైదరాబాదీలు ఉన్నారన్న వార్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని సీఎస్, డీజీపీ, విదేశాంగ శాఖతో సమన్వయం చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో స్పష్టమైన సమాచారం వెంటనే అందించాలని సీఎంఓ ప్రత్యేకంగా ఆరా తీస్తోంది.

CV Anand : బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్

ప్రమాదంపై నిరంతర సమాచారాన్ని అందించేందుకు, బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందించేందుకు తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రెండు సహాయక ఫోన్ నంబర్లను విడుదల చేశారు: +91 79979 59754, +91 99129 19545. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వ్యక్తుల సంఖ్య, వారి వివరాలు, పాస్‌పోర్ట్‌ సమాచారం వంటి అంశాలను సేకరించి తక్షణమే కుటుంబాలకు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సౌదీ యాత్రకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ బంధువులు ప్రమాదంలో ఉన్నారేమోనని కొన్ని కుటుంబాలు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం ఈ పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షిస్తోంది.

సౌదీ అరేబియాలోని బదర్–మదీనా ప్రాంతం మధ్య ముఫరహత్ వద్ద ఈ భయంకర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో నిండిన బస్సు వేగంగా వస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న సమయంలోనే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుని ప్రయాణికులు బయటపడే వీలు లేకుండా పోయింది. మృతుల్లో హైదరాబాద్‌లోని టోలిచౌక్, మల్లేపల్లి, బజార్‌ఘాట్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ప్రాథమిక సమాచారం. మల్లేపల్లి బజార్‌ఘాట్ నుంచే 16 మంది ఈ యాత్రకు వెళ్లారని తెలిసింది. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు మంటలను అదుపు చేసి శవాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యాయి. సౌదీ ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Saudi accident
  • Tragic Saudi Bus Crash

Related News

Cm Revanth Vs Aravind

CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సమగ్ర జీవిత బీమా మరియు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రధానంగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 'డిజిటల్ హెల్త్ కార్డులు' జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd