PJR flyover : వాహనదారులకు ఊరట..పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ ఫ్లైఓవర్ సముదాయాన్ని 1.2 కిలోమీటర్ల పొడవుతో, ఆరు వరుసల (లేన్‌ల)తో, సుమారు 24 మీటర్ల వెడల్పుతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద రోజూ ఎదురయ్యే తీవ్ర రద్దీ నుంచి విముక్తి కలిగించేందుకు ఇది కీలకంగా మారనుంది.
- By Latha Suma Published Date - 06:44 PM, Sat - 28 June 25

PJR flyover : హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో మరో కీలక మైలురాయి చేరుకుంది. కొండాపూర్ నుండి ఔటర్ రింగు రోడ్ (ఓఆర్‌ఆర్) వరకు నిర్మించిన పి.జనార్థన్ రెడ్డి (పీజేఆర్) ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రులు పాన్నం ప్రభాకర్, డి. శ్రీధర్ బాబు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గాంధీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఫ్లైఓవర్ సముదాయాన్ని 1.2 కిలోమీటర్ల పొడవుతో, ఆరు వరుసల (లేన్‌ల)తో, సుమారు 24 మీటర్ల వెడల్పుతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద రోజూ ఎదురయ్యే తీవ్ర రద్దీ నుంచి విముక్తి కలిగించేందుకు ఇది కీలకంగా మారనుంది.
Read Also: Telangana Police : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ దారుల్లోకి ప్రయాణించే వాహనాలకు త్వరితగమన అవకాశం కలుగుతుంది. ట్రాఫిక్ జామ్‌లు తగ్గిపోవడంతో వాహనదారులకు సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు మరింత వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తోంది. ఈ ఫ్లైఓవర్ ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నగరంలోని బిజీ ప్రాంతమైన కొండాపూర్ వరకు నిరాటంకంగా ప్రయాణించే అవకాశం కలుగుతోంది. అదే విధంగా, విమానాశ్రయం వైపు వెళ్లే ప్రయాణికులకు కూడా ఇది నేరుగా కనెక్టివిటీని కల్పిస్తుంది.
ప్రభుత్వం నగర రవాణా వ్యవస్థను ఆధునికీకరించేందుకు, పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఒక స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి మౌలిక సదుపాయాలు కీలకం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం స్థానిక ప్రజలు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులుగా ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులకు ఇదే పరిష్కారమని, నగరాభివృద్ధిలో ఇది మరో మెట్టు అని అభిప్రాయపడ్డారు.
Read Also: Hanmakonda : వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను వివస్త్రను చేసి ప్రవైట్ ప్రైవేట్ భాగాల్లో జీడిపోసారు