HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Emergency Meeting With Ministers And Officials

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అల‌ర్ట్‌!

భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు.

  • Author : Gopichand Date : 27-05-2025 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) మంత్రులు, అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం రుతుపవనాలు 15 రోజుల ముందుగా వచ్చిన నేపథ్యంలో, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, 90 శాతం సేకరణ పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. ఈ విజయానికి అధికారులు, కలెక్టర్లను అభినందించారు.

ధాన్యం కొనుగోలు కోసం రైతులకు రూ. 12,184 కోట్లు చెల్లించినట్లు, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే రుతుపవనాల ముందస్తు రాకతో మిగిలిన ధాన్యం సేకరణలో సవాళ్లు ఎదురవుతున్నాయని, దీన్ని అధిగమించేందుకు స్థానిక గోడౌన్లను అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Also Read: KCR: కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందుకు కేసీఆర్‌.. ఆ లేఖ త‌ర్వాతే ఎందుకు?

రాజకీయ ప్రేరేపిత దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు కలెక్టర్లు ప్రోయాక్టివ్‌గా ఉండాలని, ధాన్యం కొనుగోలు వివరాలను ప్రజలకు వెల్లడించాలని సీఎం సూచించారు. ఉదాహరణకు, ఒక రైతు అనారోగ్యంతో మరణించిన సంఘటనను ధాన్యం కొనుగోలుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులను 29 శాతం అధిక వర్షపాతం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయంపై కఠిన చర్యలు, అవసరమైతే పీడీ యాక్ట్ విధించాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, కొత్త టెక్నాలజీని వినియోగించాలని, ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో అందించాలని సూచించారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్లకు రుణాలు అందించాలని ఆదేశించారు. మే 29, 30 తేదీల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రులు పర్యటించాలని, జూన్ 1 నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Emergency Meeting
  • ministers
  • Officials
  • rains
  • telugu news

Related News

New Jersey

చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

New Jersey  అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా అక్కడ పసిపిల్లలపై పైశాచికత్వం ప్రదర్శించిన ఓ భారతీయుడి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే యువకుడిని అధికారులు కటకటాల్లోకి నెట్టారు. అంతేకాకుండా జైలుకు పంపడమే కాకుండా తిరిగి భారత్‌కు బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd