CM Revanth Reddy : సొంతూరులో సీఎం రేవంత్ దసరా సంబరాలు
సీఎం రేవంత్ రెడ్డి సైతం తన స్వగ్రామం కొండారెడ్డిపల్లి లో దసరా సంబరాలు జరుపుకోబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు.
- Author : Sudheer
Date : 12-10-2024 - 8:56 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ వ్యాప్తంగా దసరా (Dasara) సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఊరు, వాడ, పల్లె , పట్టణం ఇలా ఎక్కడ చూసిన సంబరాలు కనిపిస్తున్నాయి. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు నడుస్తున్నాయి. నేడు దసరా సందర్బంగా ప్రతి ఇంట్లో బంధువులు , కుటుంబ సభ్యులతో సందడి సందడి గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం తన స్వగ్రామం కొండారెడ్డిపల్లి (Kondareddypalli) లో దసరా సంబరాలు జరుపుకోబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన హైదరాబాద్ నుంచి కొండారెడ్డిపల్లి చేరుకుంటారు. ఆయన రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దసరా పండుగ నాడు కొండారెడ్డిపల్లికి వస్తుంటారు. గ్రామస్థులతో కలిసి పండుగను జరుపుకుంటారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రామంలో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also : World Arthritis Day: కీళ్లనొప్పులు రాకుండా ఉండాలంటే ఏం తినాలి ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..?