HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Delivers Great News To Workers In Telangana

Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

  • Author : Vamsi Chowdary Korata Date : 21-05-2026 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Major changes in the tourism sector... CM Revanth Reddy issues key directives.
Major changes in the tourism sector... CM Revanth Reddy issues key directives.

తెలంగాణ కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనాల పెంపు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా వివరించారు. ఇక వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు కేటగిరీలుగా కార్మికులను విభజించి వేతనాలు పెంచినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ వరాల జల్లు కురిపించింది. వారికి అందే కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో తెలంగాణలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయాలను, విధివిధానాలను వివరించారు. ఇక రాష్ట్రంలోని కార్మికులను ప్రభుత్వం మూడు జోన్లుగా విభజించింది. కార్పొరేషన్ల పరిధిలో ఉండే కార్మికులను గ్రేడ్ 1గా, మున్సిపాలిటీ పరిధిలో ఉండే కార్మికులను గ్రేడ్ 2గా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మికులను గ్రేడ్ 3గా పేర్కొంది.

ఇక అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ అంటూ నాలుగు కేటగిరీలుగా కార్మికులను విభజించి వారికి కనీస వేతనాలను పెంచుతున్నట్లు చెప్పారు. జోన్ 1లో కనీస వేతనం ప్రస్తుతం రూ.12,750 ఉండగా.. దానిని రూ.16 వేలకు పెంచారు. ఇక స్కిల్డ్ కార్మికులకు రూ.13,772గా ఉన్న జీతాలను రూ.18,500లకు పెంచారు. ఇక జోన్ 1లో సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13,592 నుంచి రూ.17,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసి చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని కార్మికుల సంక్షేమానికి తమ సర్కారు కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని కార్మికులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. కార్మికుల కనీస వేతనాలపై సబ్‌కమిటీని వేసినట్లు చెప్పారు. దీంతో కోటి 11 లక్షల మందికి మేలు జరుగుతుందని వివరించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anumula Revanth Reddy
  • cm revanth
  • congress party
  • telangana government
  • Wages Hike

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd