Revanth Reddy : కొడంగల్ లో ఫార్మా సిటీ పై సీఎం రేవంత్ క్లారిటీ
Lagacharla Pharma Company : తమ ప్రాంతంలో ఫార్మా సిటీ వద్దంటే వద్దు అంటూ అక్కడి రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో అధికారులు ప్రజాసేకరణకు వెళ్లడం..రైతులు తిరగబడడం..ఆ తర్వాత కేసులు , అరెస్టులు ఇవన్నీ జరిగిపోయాయి
- By Sudheer Published Date - 09:15 PM, Sat - 23 November 24

లగచర్ల ఘటన (Lagacharla Incident) తెలంగాణ వ్యాప్తంగా (Telangana) సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తమ ప్రాంతంలో ఫార్మా సిటీ (Pharma City) వద్దంటే వద్దు అంటూ అక్కడి రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో అధికారులు ప్రజాసేకరణకు వెళ్లడం..రైతులు తిరగబడడం..ఆ తర్వాత కేసులు , అరెస్టులు ఇవన్నీ జరిగిపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో ఈరోజు కమ్యూనిస్టు పార్టీల నేతలు సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా లగచర్లలో తాము పర్యటించి పరిశీలించిన విషయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ రెండు పంటలు పండే భూములు ఉన్నాయని , రైతులను ఇబ్బంది పెట్టవద్దని , రైతుల తరఫున వినతీపత్రాన్ని అందజేశారు. దీంతో సొంత నియోజకవర్గ ప్రజలను నేనే ఎందుకు ఇబ్బంది పెడతానని సీఎం చెప్పుకొచ్చారు. అసలు కొడంగల్ ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గంలోని యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని , కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని, భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. లగచర్లలోని భూములనే తీసుకోవాలని లేదని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రైతుల బాధలు తనకు తెలుసని, తను కూడా రైతు కుటుంబం నుండే వచ్చానని , అమాయక రైతులపై కేసుల విషయం లో పరిశీలిస్తామని తెలిపారు.
Read Also : Samsung : డిజిటల్ హెల్త్, ఏఐ ఇతర కొత్త సాంకేతికతలపై సామ్‌సంగ్ ఒప్పందం..