CM Revanth : అక్బరుద్దీన్ ఒవైసీ కి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం ఆఫర్
అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని .. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి.. దగ్గరుండి నామినేషన్ వేయిస్తానని
- Author : Sudheer
Date : 27-07-2024 - 5:58 IST
Published By : Hashtagu Telugu Desk
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi)కి..సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బంపర్ ఆఫర్ (Bumper offer) ప్రకటించారు..ఏకంగా డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. పదేళ్ల బిఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకొని సమావేశాలు నడుస్తున్నాయి. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు ఎంఐఎం పార్టీ సైతం బిఆర్ఎస్ ఫై విమర్శలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీకి మెట్రో కలగానే మారిపోయిందని.. పదేళ్లు కేసీఆర్ అదిగో…ఇదిగో అంటూ మెట్రో విషయంలో కాలయాపన చేశారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు సమయం ఇచ్చారని.. తమకు నాలుగేళ్ల సమయం ఇస్తే చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్ లో మిమ్మల్ని ఓటు అడుగుతానంటూ పేర్కొన్నారు. తాను గతంలో ఓబీసీ వ్యక్తికి టికెట్ ఇచ్చానని.. తమకు కూడా ఓబీసీలపై ప్రేమ ఉందని.. ఎంఐఎం అతని గెలుపు కోసం సహకరించాలంటూ కోరారు.. ఈ క్రమంలో.. అక్బరుద్దీన్ స్పందిస్తూ తాము ఎటువెళ్లాలంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని .. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి.. దగ్గరుండి నామినేషన్ వేయిస్తానని.. గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానని సీఎం రేవంత్ అన్నారు.
Read Also : Godavari Flood : భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ