National Handlooms Day: చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజు చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చెంత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు
- By Praveen Aluthuru Published Date - 10:26 AM, Mon - 7 August 23

National Handlooms Day: ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజు చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం అన్నారు. వారి కుటుంబాల్లో సంతోషం నింపేందుకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినట్టు ఆయన అన్నారు.
ఇది చేతల ప్రభుత్వం… చేనేతల ప్రభుత్వం #NationalHandloomDay pic.twitter.com/lvtO9ki8ni
— BRS Party (@BRSparty) August 7, 2023
తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అందులో భాగంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం వారికి నెలకు 2,106 రూపాయల ఫించన్ ఇస్తున్నట్టు సీఎం గుర్తు చేశారు. బతుకమ్మ చీరల ద్వారా నేత కార్మికులకు ఉపాధి కల్పించి, నేతన్నల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని సీఎం తెలిపారు. ‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రయోజనం కల్పించామని తెలిపారు. ‘నేతన్నకు చేయూత’ పథకం అమలు చేస్తూ వారి ఆదాయం పెరిగేలా కృషి చేశామన్నారు. అంతేకాకుండా వారికీ నేరుగా సాయం అందే విధంగా చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. చేనేత మిత్ర ద్వారా నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతానికి పెంచామన్నారు. ప్రభుత్వం 28.96 కోట్ల రుణ మాఫీ చేసిందని, పావలా వడ్డీ ద్వారా రూ.120 కోట్ల రుణాలను 523 సొసైటీలకు ఇచ్చామని తెలిపారు సీఎం కేసీఆర్.
Also Read: Tilak Varma: తిలక్ వర్మ అరుదైన రికార్డ్.. చిన్న వయసులో హాఫ్ సెంచరీ