TS CM KCR : ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్…స్వామివారికి కిలో బంగారం సమర్పణ..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకునేందుకు సతీసమేతంగా వెళ్తున్నారు.
- By hashtagu Published Date - 07:16 AM, Fri - 30 September 22

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకునేందుకు సతీసమేతంగా వెళ్తున్నారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించిన ఆనంరతం ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి చేరుకుంటారు. ప్రత్యేక పూజ అనంతరం అధికారుతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం మూడు గంటల కు హైదరాబాద్ చేరుకుంటారు. దసరాకు జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో…సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక దసరాకు ముందే సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకుంటారని సమాచారం.