Telangana: సెప్టెంబర్ 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం
కృష్ణా నదీ జలాలను ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 16న ప్రారంభించనున్నారు
- Author : Praveen Aluthuru
Date : 07-09-2023 - 5:59 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: కృష్ణా నదీ జలాలను ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 16న ప్రారంభించనున్నారు. వరంగల్ లోని నార్లాపూర్ ఇంటెక్ పాయింట్ వద్ద సీఎం కేసీఆర్ బటన్ నొక్కి ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. పిఆర్‌ఎల్‌ఐఎస్ ప్రారంభోత్సవాన్ని సెప్టెంబర్ 17న ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.నార్లాపూర్‌లో ప్రాజెక్టును ప్రారంభించిన తరువాత కృష్ణానదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు పాలమూరును నిర్లక్ష్యం చేశాయని దాంతో ప్రజలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భీమా, కల్వకుర్తి, కోయిలసాగర్, పాలమూరులోని ఇతర సాగునీటి ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.
Also Read: G20 Summit 2023: విశ్వ కళ్యాణానికి ఆసియాన్ దేశాలు ముందుండాలి : ప్రధాని మోదీ