Government Teachers: టీచర్ల బదిలీల, ప్రమోషన్లకు ‘కేసీఆర్’ గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ టిచర్ల బదిలీలకు,ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విద్యా శాఖ (Education Department) ప్రకటన విడుదల చేసింది
- Author : Balu J
Date : 16-01-2023 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఎట్టకేలకు ప్రభుత్వ టిచర్లకు (government teachers) తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్ వినిపించింది. బదిలీలకు,ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ విద్యా శాఖ (Education Department) మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో (government teachers) భేటి అయ్యారు. వీరి మధ్య సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, చర్చలు విజయవంతం అయ్యాయని అధికారులు తెలిపారు.
కేజీబిబి, మోడల్ స్కూళ్ళతో సహా ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ బదిలీలు, ప్రమోషన్లు జరుగుతాయని అధికారులు చెప్పారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంభందించి షెడ్యూల్ విడుదలవుతుంది. కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ సాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 9,266 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి లభిస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముందుగా ప్రధానోపాధ్యాయులకు (government teachers) పదోన్నతులు జరుగుతాయని అన్నారు.
Also Read: Sushmita Konidela: నాన్నగారిని చూస్తుంటే పండగలా ఉంది : సుస్మిత కొణిదెల