Telangana: మంథని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
మంథని నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. తాజాగా మంథనిలో తమ కార్యకర్తపై దాడి జరగడంతో ఈరోజు మంథని నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్.
- By Praveen Aluthuru Published Date - 05:57 PM, Wed - 22 November 23

Telangana: మంథని నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. తాజాగా మంథనిలో తమ కార్యకర్తపై దాడి జరగడంతో ఈరోజు మంథని నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్.
మహాముత్తారం మండలం మినాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిస్తాపూర్ వద్ద మంగళవారం రాత్రి కాంగ్రెస్ , బీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల నేతలు ప్రచార రథలపై డీజే సౌండ్ బాక్స్ లు పెట్టి మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఎక్కువ మోతాదులో సౌండ్ పెట్టడంతో చిన్న గొడవ మొదలైంది.దీంతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ పడ్డారు. ఈ దాడిలో ఓడేడ్ సర్పంచ్ సిరికొండ బక్కారావు, మహాముత్తారం మాజీ జెడ్పీటీసీ రాజిరెడ్డికి గాయాలయ్యాయి. మినాజీపేటలో పోలీసు వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోగా , బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఓడేడ్ సర్పంచ్ బక్కారావుపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ నేడు మంథని నియోజకవర్గ బంద్ పాటించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాశ్ పిలుపునిచ్చారు .
Also Read: Akbaruddin: పోలీసులకు అక్బరుద్దీన్ వార్నింగ్.. వీడియో వైరల్