BJP Only 2 : బీజేపీకి 2 సీట్లే.. ‘సివిక్ పోల్’ సంచలన సర్వే నివేదిక
BJP Only 2 : లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ‘సివిక్ పోల్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.
- By Pasha Published Date - 11:23 AM, Wed - 17 April 24

BJP Only 2 : లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ‘సివిక్ పోల్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. దీని ప్రకారం.. రాష్ట్రంలో బీజేపీకి కేవలం 2 లోక్‌సభ స్థానాలే వస్తాయి. అంతకుమించి ఆ పార్టీకి రావడం కష్టమని సర్వే నివేదిక అభిప్రాయపడింది. క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకుండా అంతకుమించి సీట్లను బీజేపీ సాధించలేదని తేల్చి చెప్పింది. గ్రామగ్రామాన పెద్దసంఖ్యలో క్యాడర్ కలిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉంటుందని సివిక్ పోల్ సర్వే నివేదిక వెల్లడించింది.
https://twitter.com/TeluguScribe/status/1780460037699481972?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1780460037699481972%7Ctwgr%5E0a735c815ab46524790593b033d275a3882debd1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fadmin.dishadaily.com%2Fmain.jsp
We’re now on WhatsApp. Click to Join
సివిక్ పోల్ సర్వే నివేదిక ప్రకారం.. తెలంగాణలో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వస్తాయి. హోరాహోరీ పోరు ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందని రిపోర్టులో ప్రస్తావించారు. 2 స్థానాల్లో బీజేపీ(BJP Only 2), 1 స్థానంలో ఎంఐఎం విజయఢంకా మోగిస్తాయని తెలిపింది. ఇదే సంస్థ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంచలన రిపోర్టును విడుదల చేసింది. బీఆర్ఎస్‌కు 40, కాంగ్రెస్‌కు 66, బీజేపీకి 4, బీఎస్పీకి 2, ఎంఐఎంకు 5, సీపీఐకి 1 స్థానం వస్తాయని తెలిపింది. అచ్చం అదే రేంజులో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫలితాలను సాధించాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల విషయంలో సివిక్ పోల్ సర్వే సంస్థ వేస్తున్న అంచనాలు నిజమవుతాయా ? కాదా ? అనేది తెలియాలంటే ఫలితాలు వచ్చేదాకా వేచిచూడాలి.
Also Read : Amit Shah – Secret Operation : తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో అమిత్ షా ‘సీక్రెట్’ ఆపరేషన్!
ఇక తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రైతుల ఇష్యూను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. మోడీ పేరును నమ్ముకొని బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయోధ్య రామ మందిర అంశం తమకు ప్లస్ అవుతుందని వారు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సెంటిమెంట్ ఉత్తర భారతదేశంలో మాత్రమే బీజేపీకి వర్క్ ఔట్ అయ్యే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు, కులగణన, మహిళల సాధికారత కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన న్యాయ్ హామీలు తమను విజయతీరాలకు చేరుస్తుందనే ధీమాతో తెలంగాణ కాంగ్రెస్ ఉంది.