Sankranti: సొంతూళ్లకు వెళ్తున్న సిటీజనం.. వాహనాలతో హైవేపై రద్దీ!
- By Balu J Published Date - 02:07 PM, Fri - 12 January 24

Sankranti: శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
పంతంగి వద్ద టోల్ ప్లాజా దాటేందుకు సుమారు పది నిమిషాలకుపైనే సమయం పడుతోంది. మొత్తం 18 టోల్ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. కాగా తెలంగాణలోని పాఠశాలలకు శుక్రవారం (జనవరి 12) నుంచి సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వనున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులకు.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి.
కాగా జనవరి 13న 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. కాగా.. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి.
సంక్రాంతి సెలువులు జనవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి.. జనవరి 13న రెండో శనివారం, తర్వాత జనవరి 14న ఆదివారం భోగి పండుగ కాగా.. జనవరి 15న సోమవారం సంక్రాంతి పర్వదిన వస్తోంది. ఇక, జనవరి16న కనుమ పండగ ఉంది. కాగా, జనవరి 17న ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వస్తున్నాయి.