HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Center Shows Discrimination Against Telangana Cm Revanth

Padma Awards : తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుంది – సీఎం రేవంత్

Padma Awards : ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు ఇస్తూ, తెలంగాణకు న్యాయం చేయలేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు

  • Author : Sudheer Date : 26-01-2025 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Center Shows Discrimination
Center Shows Discrimination

తెలంగాణ(Telangana)కు పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Padma Awards) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, గద్దర్, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు అవార్డులు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న రేవంత్.. ఈ వివక్షపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు ఇస్తూ, తెలంగాణకు న్యాయం చేయలేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు. వర్సిటీల వైస్ చాన్సెలర్ నియామకాలను యూజీసీ ఆధ్వర్యంలో చేపట్టే ప్రయత్నం రాష్ట్రాల ప్రతిపత్తిపై దాడి కిందకే వస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు.

Jagan- Bharati: జ‌గ‌న్‌- భార‌తి మ‌ధ్య విభేదాలు.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం!

తెలంగాణకు కేవలం ఇద్దరికే అవార్డులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర సిఫారసు చేసిన పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడం రాష్ట్ర ప్రజలను కించపరచినట్టే అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వలేదని తక్షణ చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. పద్మ అవార్డ్స్ విషయంలో కేంద్రం చూపిన వివక్ష పట్ల తెలంగాణ ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి తగిన గౌరవం ఇవ్వకుండా వివక్ష చూపించడం అన్యాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పద్మ అవార్డుల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, రాష్ట్రాల ప్రతిపత్తికి విలువ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే ..

2025 సంవత్సరానికి గానూ మొత్తం 139 మందిని కేంద్రం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో ఏడుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి (పద్మ విభూషణ్) మరియు మందకృష్ణ మాదిగ (పద్మశ్రీ) లకు అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నందమూరి బాలకృష్ణ (పద్మభూషణ్), KL కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, వద్దిరాజు రాఘవేంద్రాచార్య, మిర్యాల అప్పారావ్‌లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • CM Revanth Reddy
  • Padma Awards 2025

Related News

Cm Revanth Mptc Zptc

Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తో ముడిపెట్టడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd