Agnipath Protest : రక్షణ మంత్రి రాజ్ నాథ్ పై హైదరాబాద్ లో కేసు
సికింద్రాబాద్ పోలీసుల కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ మరణవాగ్ములం ప్రకారం రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది
- By CS Rao Updated On - 02:39 PM, Sat - 18 June 22

సికింద్రాబాద్ పోలీసుల కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ మరణవాగ్ములం ప్రకారం రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు డీజీపీ మహేంధ్రరెడ్డిని కలసి వినతి పత్రాన్ని ఏఐసీసీ మెంబర్ బక్కా జడ్సన్ అందచేశారు. మరణవాగ్మూలం ప్రకారం Under Section-32(1) of Indian Evidence Act, 1872 కింద రాజనాధ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిగాయి. ఆ సందర్భంగా వరంగల్ కు చెందిన రాకేశ్ మరణించాడు. చనిపోయే సమయంలో వరంగల్ జిల్లాకు చెందిన దామోదర్ రాకేశ్ మరణవాగ్మూలం ఇచ్చారు. దాని ప్రకారం మరణనానికి రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ కారణం అని చెప్పాడు. దీంతో కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ కాల్పులకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందా లేక ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందా ? అంటూ ప్రశ్నిస్తోంది. రాకేష్ పార్దివ దేహం అంతిమ యాత్రలో జాతీయ జెండా కు బదులు తెరాస పార్టీ జెండాలు పెట్టడం సిగ్గు చేటుగా నిలుస్తోందని కాంగ్రెస్ నేత జడ్సన్ అన్నారు. గతంలో వరంగల్ కు చెందిన బోడ సునీల్ తన మరణవాగ్మూలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు చెప్పాడు. రెండు నెలల కింద ఖమ్మం జిల్లా లో సాయి గణేష్ తన మరణవంగ్ములంలో మంత్రి పువ్వాడ అజయ్ పేరు చెప్పి చనిపోయాడు. ఈ మూడు సంఘటనలను ఉటంకిస్తూ డీజీపీ కి జడ్సన్ వినతి పత్రం ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

Whatsapp Image 2022 06 18 At 2.25.44 Pm

Whatsapp Image 2022 06 18 At 2.35.31 Pm
Related News

Agnipath Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసంపై సీక్రెట్ రిపోర్ట్! వాళ్లు లైట్ తీసుకోవడం వల్లే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక అసలు కారణాలు బయటికొస్తున్నాయి. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేయడానికి వస్తున్నారన్న సమాచారం ఉన్నా.. లైట్ గా తీసుకోవడం వల్లే ఇంతటి దారుణం చోటుచేసుకుందని స్పష్టమైంది.