TRS vs BJP : ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి..29 మంది బీజేపీ నేతలపై కేసు నమోదు
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఆందోళన చేసిన బీజేపీ నేతలపై
- By Prasad Published Date - 10:31 AM, Tue - 23 August 22

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఆందోళన చేసిన బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆందోళన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు వారిని తరిమికొట్టారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐపీసీ సెక్షన్ 341, 147,148,353,332, 509 ఆర్/డబ్ల్యూ 149 కింద కేసు నమోదు చేశారు. వారికి 41 సిఆర్‌పిసి కింద నోటీసు జారీ చేశారు. వారందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వారిని అరెస్టు చేయలేదని.. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.