C.V. Anand Returns : హైదరాబాద్ సీపీగా మరోసారి సీవీ ఆనంద్
C.V. Anand returns : హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ మరోసారి నియమితులయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం వరకు ఆనంద్.. హైదరాబాద్ సీపీగా సేవలందించారు
- By Sudheer Published Date - 04:03 PM, Sat - 7 September 24

C.V. Anand returns as Hyderabad police commissioner : తెలంగాణ(Telangana)లో మరోసారి ఐపీఎస్ అధికారులు బదిలీల (Transfer of IPS Officers
) పర్వం కొనసాగింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ (C.V. Anand) మరోసారి నియమితులయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం వరకు ఆనంద్.. హైదరాబాద్ సీపీగా సేవలందించారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సీపీగా పని చేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పదోన్నతి పొందారు. కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన 2021లో తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. 2023 ఆగస్టులో డీజీపీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమయంలో ఆయనను సీపీ పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ సీపీగా నియామకం అయ్యారు.
ఇదిలా ఉంటె గణేష్ నవరాత్రుల సందర్బంగా ఈరోజు నుండి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
Traffic Restrictions in Hyderabad for 10 Day Ganesh Festival :
ఖైరతాబాద్ వినాయక విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతిలేదు.
పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్‌దూత్ లైన్‌లోకి అనుమతించరు.
ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించరు.
ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు.
నెక్లెస్ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతిలేదు.
ఖైరతాబాద్ పోస్టాఫీస్ లేను ఖైరతాబాద్ రైల్వే గేటు వైపు అనుమతించరు.
నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు వాహనాల కోసం ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు,
ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ంగ్ సదుపాయం కల్పించారు.
Read Also : Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు