HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Vs Congress In Telangana

BRS vs Congress : తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు సీన్ రివ‌ర్స్‌.. స‌ర్వేల్లో..?

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేక గాలి వీస్తోంది. ఎదురే లేదని విర్ర వీగిన గులాబీ నేతలకు అన్ని విషయాలు బూమ్

  • Author : Prasad Date : 06-07-2023 - 11:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trs
Trs

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేక గాలి వీస్తోంది. ఎదురే లేదని విర్ర వీగిన గులాబీ నేతలకు అన్ని విషయాలు బూమ్ రాంగ్ అవుతున్నాయి. ఏ ఒక్క హామీ అమలు చేయలేని దుస్థితి అన్ని వర్గాల ప్రజలను దూరం చేస్తోంది. తాజాగా సర్వే సంస్థలు బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు స్పస్టం చేస్తున్నాయి. అణగారిన బహుజన వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్ కు దూరమైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ వారికి ఆశాజ్యోతిగా కనిపిస్తోంది. భట్టి పాదయాత్రలో ఇదే స్పష్టం అయింది. ఎన్నికల వేళ దీనిని మరింత బలోపేతం చేసుకొనే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. మూడో సారి హ్యాట్రిక్ కొడతామంటూ బీఆర్ఎస్ నేతల ఆశలు ఫలించటం సాధ్యం కాదు. క్షేత్ర స్థాయి నివేదికలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఎన్నో ఆశలతో గెలిపించిన కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం వారి అంచనాలను అందుకోలేకపోయింది. ప్రధానంగా బీసీలు, అణగారిన బహుజన వర్గాల ప్రజలు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలు, అవకాశాల కల్పనలో ప్రాధాన్యత దక్కటం లేదు. కేబినెట్ నుంచి పంచాయితీ వరకు ఈ వర్గాల పైన నిర్లక్ష్యం, ఉదాసీనత కనిపిస్తున్నాయి. తొమ్మిదేళ్ల కాలంలో కొనసాగుతున్న వివక్ష.. అవినీతి బీఆర్ఎస్ పాలకుల పైన తీవ్ర వ్యతిరేకతకు కారణంగా స్పష్టం అవుతోంది.

సెంటిమెంట్ పండిస్తూ.. ఆకర్షణీయ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని అమలు చేయటంలో మాత్రం విఫలమైంది. 2014 – 2018 వరకు తొలి విడత ప్రభుత్వంలో కొన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకోగలిగిన కేసీఆర్, రెండో విడత ప్రభుత్వంలో మాత్రం వైఫల్యాలు మూటగట్టుకున్నారు. తెలంగాణలో పార్టీల గెలుపు ఓటమలును నిర్దేశించే ప్రధాన ఓటింగ్ వర్గాలు బీఆర్ఎస్ కు పూర్తిగా దూరమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివక్షకు గురవుతన్న వర్గాలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి నిర్వహించిన పీపుల్స్ మార్చ్ యాత్రలో ఇదే విషయం స్పష్టమైంది. వారి ఆవేదన.. వారిలోని బాధకు ఓదార్పు ఇస్తూ వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భట్టి హామీ ఇచ్చారు. ఇతర నేతల్లా కార్ల హడావుడి.. బౌన్సర్ల హంగామా లేకుండా..నిరాడంబంరగా పేదల మధ్యకు వెళ్లిన భట్టికి ప్రజల మూడ్ స్పష్టంగా అర్థమై, వారికి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తోనే తామంతా అంటూ ఆ వర్గాలు హామీ ఇచ్చాయి. తాజాగా రాహుల్ గాంధీతో భట్టి సమావేశ సమయంలోనూ ఇవే అంశాలు చర్చించారు. ఫలితంగా ఈ వర్గాల ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. తొలిగా ప్రకటించిన చేయూత స్కీం కూడా పేదలను ఉద్దేశించి ప్రకటించినదే. దీంతో, ఇప్పుడు బీఆర్ఎస్ ను నమ్మి మోసపోయిన వారికి కాంగ్రెస్ దిక్సూచీగా మారుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CLP leader Bhatti Vikramarka
  • congress
  • rahul gandhi
  • telangana
  • tpcc
  • trs

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Skin Care: మీ అందమైన చర్మం కోసం ఐదు చిట్కాలు

    • Revanth Reddy: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Karuppu: సూర్య కరుప్పు కు షాక్.. మార్నింగ్‌ షోలు రద్దు

    • AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్

    Trending News

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd