HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs To Setup Legal Cell To Fight Against False Cases

BRS Legal Cell: పార్టీ కార్యకర్తల కోసం ‘లీగల్ సెల్’ ఏర్పాటు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ 'లీగల్ సెల్'ను ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు

  • By Praveen Aluthuru Published Date - 11:04 PM, Thu - 11 January 24
  • daily-hunt
BRS Legal Cell
BRS Legal Cell

BRS Legal Cell: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ ‘లీగల్ సెల్’ను ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో ఈ సెల్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ట్రస్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. అలాగే పార్టీ బలోపేతానికి మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పై అధికార పార్టీ తప్పుడు సమాచారం సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ‘స్పీడ్ బ్రేకర్’గా అభివర్ణించిన ఆయన కార్మికుల శ్రమతో బీఆర్‌ఎస్‌ మంచి పనితీరు కనబరుస్తుందని అన్నారు.అనేక ముఖ్యమైన పథకాలను అందించడంలో బీఆర్ఎస్ విజయవంతమైనప్పటికీ, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో పార్టీ విఫలమైందని హరీష్ అన్నారు.

తెలంగాణ భవన్ లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని పేర్కొన్నారు. నెల తర్వాత కేసిఆర్ కూడా తెలంగాణ భవన్ లో అడుగు పెడతారు. అందరం ఇక్కడే ఉంటాం. కలిసి పని చేద్దాం. ఎవరికైనా సమస్య వస్తే అందరం బస్ వేసుకొని మీ ముందుకు వస్తాం. మొదటి కేబినెట్ లో మొదటి డీఎస్సీ అన్నారు ఏమైందన్నారు హరీష్. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. వారిది వారికే పడటం లేదు. భవిష్యత్ మనదేనని స్పష్టం చేశారు హరీష్ రావు.

బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. బీఆర్‌ఎస్‌కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందనన్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు కేటీఆర్. అనవసర కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని పోరాడాలన్నారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందన్నారు కేటీఆర్. కేటీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు.

Also Read: IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • false cases
  • harish rao
  • ktr
  • legal cell
  • telangana

Related News

Telangana Government

Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ‌ ప్రభుత్వం భారీ నజరానా!

మొత్తం రూ. 2,780 కోట్లను 138 పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

  • Pm Modi In Bihar

    PM Modi: ప్రధాని మోదీ: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది!

  • NIzam

    Nizam’s properties : నిజాం ఆస్తులపై కోర్టు సంచలన నిర్ణయం

  • Liquor Shop

    Liquor Shop: తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగింపు!

  • Telangana Liquor Tenders

    Liquor Tenders : నేటితో ముగియనున్న మద్యం టెండర్ల గడువు

Latest News

  • Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత

  • CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!

  • Montha Cyclone: మొంథా తుపాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క సూచ‌న‌లు!

  • Rohit Sharma: అజిత్ అగార్కర్‌కు సెంచ‌రీతో స‌మాధానం ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌!

  • Coconut : దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కారణాలు ఇవీ

Trending News

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

    • Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. వీడియో వైర‌ల్‌!

    • IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!

    • Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!

    • Janhvi Kapoor : బాలీవుడ్‌లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd