Revanth Reddy : బిఆర్ఎస్ పార్టీ..అధికారం అనేది మరచిపోవాల్సిందే – రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని గతంలో చెప్పాను
- By Sudheer Published Date - 06:33 PM, Wed - 9 October 24

బీఆర్ఎస్ (BRS) ఇక అధికారంలోకి రాబోదని సీఎం రేవంత్ (Revanth Reddy) అన్నారు. ‘పదేళ్లుగా ఉద్యోగాలు లేవు, బదిలీలు లేవు. మేం వచ్చిన 60 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం.. విద్యా రంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను పటిష్ఠం చేశామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. DSC ఫలితాల్లో కొత్తగా టీచర్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు బుధువారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ స్వయంగా నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని గతంలో చెప్పాను. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారు. 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేసి నియామకపత్రాలు ఇచ్చాం. డీఎస్సీ ద్వారా 65 రోజుల్లో 10,006 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేశాం. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రబుత్వ పాఠశాలల పాత్ర కీలకం. గతంలో విద్యాశాఖలో బదిలీలు, పదోన్నతులు లేవు. విద్యాశాఖ నా దగ్గరే ఉంది సమస్యలు పరిష్కరించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాబోదని ..పదేళ్లుగా ఉద్యోగాలు లేవు, బదిలీలు లేవు. మేం వచ్చిన 60 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. విద్యా రంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను పటిష్ఠం చేస్తున్నాం. డీఎస్సీని ఆపాలని గుంట నక్కలు, కొరివి దెయ్యాలు ప్రయత్నించాయి. తెలంగాణ సమాజం మీద కేసీఆర్ కు ఎందుకంత కోపం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ నిర్మాణంలో టీచర్లు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మారబోతున్నారని తెలిపారు. డీఎస్సీ విజేతల సంతోషాన్ని చూసి కొందరు కళ్లల్లో కారం పెట్టుకుంటారని ధ్వజమెత్తారు. టీచర్లే తెలంగాణ వారధులు, నిర్మాతలు అని కొనియాడారు. పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చే బాధ్యత టీచర్లదేనంటూ సీఎం పేర్కొన్నారు.
Read Also : YS Sharmila : తక్షణమే APPSC చైర్మన్‌ను నియమించండి : వైఎస్ షర్మిల