HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Mlc Kavitha Fires On Congress Bjp

BRS Manifesto 2023 : బీఆర్ఎస్ మెనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు – ఎమ్మెల్సీ కవిత

ప్రగతి పథంలో దూసుకెళ్తన్న తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేలా మెనిఫోస్టో ఉందని అన్నారు

  • Author : Sudheer Date : 16-10-2023 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavithabrs
Kavithabrs
  • కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు
  • అమరజ్యోతి వద్దకు వచ్చి రాహుల్ గాంధీ నివాళులర్పించగల ధైర్యం ఉందా ?
  • అమరులకు నివాళులర్పిస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు కొన్నయినా తొలుగుతాయి
  • ఆత్మహత్యలకు కారణమే కాంగ్రెస్
  • అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన బీజేపీ
  • ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి ?
  • రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది ?
  • గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
  • ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేలా బీఆర్ఎస్ మెనిఫెస్టో
  • బీఆర్ఎస్ మెనిఫెస్టో పేదల వర్గాల అభ్యున్నతికి బాటలు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టో (BRS Manifesto 2023)ను చూసి కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీల్లో గుబులు మొదలైందని, ఆ పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) స్పష్టం చేశారు. అందుకే ఆ రెండు పార్టీల నేతల అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని, అబద్దాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని విమర్శించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా తమ పార్టీ మెనిఫెస్టో ఉందని, అన్ని వర్గాలకు మరింత అభ్యున్నతి కలిగేలా ఉందని తెలిపారు.

ఇటువంటి మెనిఫోస్టో (Manifesto ) కలలో కూడా ఊహించలేదని, కేసీఆర్ ఇన్ని రకాల హామీలను ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) భావించలేదని చెప్పారు. బీఆర్ఎస్ మెనిఫెస్టోను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చిత్తుకాగితంతో పోల్చడం పట్ల కవిత మండిపడ్డారు. చిత్తుకాగితం కాంగ్రెస్ పార్టీదా తమ పార్టీదా అని ఎన్నికల్లో ప్రజలు తేల్చుతారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ అన్ని లెక్కలు తీసుకొని సహేతుకంగా ప్రకటించిన మెనిఫెస్టోను చిత్తుకాగితమంటే… ఎటువంటి బాధ్యత, తాడూ బొంగరం లేని కాంగ్రెస్ చెప్పే మాటలు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కర్నాటకలో హామీలు అమలు చేయలేమని అక్కడి మంత్రలే ప్రకటిస్తున్న ఉదంతాలను చూస్తున్నామని, కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని విమర్శించిరు. “అంశాలవారీగా మాట్లాడకుండా అమరవీరుల స్థూపం వద్దకు రండి… ప్రమాణం చేయండని సవాలు చేయడం రేవంత్ రెడ్డి స్థాయికి తగదు. అనేక మంది అమరులయ్యారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే రాహుల్ గాంధీని అమరజ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పించమని చెప్పండి. అప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు ఏమన్న తొలగిపోతాయో చూద్దాం” అని సవాలు విసిరారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలంగాణ స్థితిగతులపై ఎటువంటి అవగాహన లేదని విమర్శించారు. ఏమి తెలియని స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ ను చదవడం కాంగ్రెస్ జాతీయ నాయకులు మానుకోవాలని సూచించారు.

అబద్ధాలు చెప్పడంలో బీజేపీ (BJP) ఆరితేరిందని, రూ. 15 లక్షలు ఒక్కో ఖాతాలో వేస్తామని చెప్పి విస్మరించారని, ఏటా 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో 2 లక్షల 21 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించి యువతకు భరోసా కల్పించామని వివరించారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఏమయ్యాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల కోసం సీఎం కేసీఆర్ (CM KCR) మంచి మెనిఫెస్టోను విడుదల చేశారని తెలిపారు. ప్రగతి పథంలో దూసుకెళ్తన్న తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేలా మెనిఫోస్టో ఉందని అన్నారు. సంపదను సృష్టిస్తూ ఆ సృష్టించిన సంపదను పేద ప్రజలకు పంచుతూ దేశంలోనే తెలంగాణను ప్రత్యేక మోడల్ ను సృష్టించామని స్పష్టం చేశారు. మనం సృష్టించిన మోడల్ గురించి దేశ ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. 2014లో రూ. లక్షా 12 వేలుగా ఉన్న తలసరి ఆదాయం ఈనాడు రూ. 3 లక్షల 15 వేలకు చేరిందంటేనే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అందరినీ సమానంగా చూసే వ్యక్తి కాబట్టి పారిశ్రామికవేత్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పాడి పరిశ్రమదారులకూ అంతే ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. భూమి లేని పేదలు, పేద మహిళలను అభివృద్ధి చేసేలా మెనిఫోస్టో ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా మెనిఫెస్టో ఉందని తెలిపారు. తమ పార్టీ మెనిఫెస్టోను ప్రజలు ఆమోదిస్తారన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Nani Hi Nanna : ఎమోషనల్ సినిమాలో ఈ లిప్ లాక్స్ ఏంటి బాసు..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BRS Manifesto
  • BRS MLC kavitha
  • congress
  • Congress Manifesto
  • kcr

Related News

Indiramma Houses

CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమ‌వారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశను ప్రారంభించనున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ పథకం మొదటి దశ కింద కేరమేరి మండలం, కొత్తారి గ్రామంలో కోలం తెగకు చెందిన ఆదివాసుల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేస్తారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండ

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd