Sexual Harassment: మహిళా సర్పంచ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు!
బీఆర్ఎస్ లో లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- By Balu J Published Date - 11:35 AM, Fri - 10 March 23

బీఆర్ఎస్ (BRS) పార్టీ దేశ రాజకీయాల్లో ఒకవైపు ప్రభావం చూపుతుంటే.. మరోవైపు ఆ పార్టీలోని అంతర్గత సమస్యలు పార్టీకి అడ్డంకిగా మారుతున్నాయి. ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు, గ్రూపు తగాదాలు, టికెట్స్ ఇష్యూ ప్రధానంగా కనిపించేది. కానీ బీఆర్ఎస్ లో లైంగిక వేధింపులు కూడా ఎక్కువవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓ లేడీ సర్పంచ్‌పై మనసు పడ్డానంటూ ఎమ్మెల్యే మరో బీఆర్ఎస్ (BRS) నాయకుడితో రాయబారం చేయడంపై సదరు మహిళా సర్పంచ్(Sarpanch)తన గోడును స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ వార్త ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈవిషయంపై ఇప్పటి జానకీపురం(Janakipuram) సర్పంచ్ నవ్య (Navya)మీడియా ముందుకొచ్చారు. తనను బీఆర్ఎస్ నాయకుడు పెడుతున్న లైంగిక, మానసిక వేధింపులపై ఘాటు ఆరోణలు చేశారు.
షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం, డబ్బుతో పాటు తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానంటూ ప్రలోభపెడుతున్నారని ..తనకే కాదు మండలంలోని మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది సర్పంచ్ నవ్య. ప్రస్తుతం ఈ ఇష్యూ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ (BRS) ఈ ఇష్యూను ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాల్సిందే!
Also Read: Ileana D’Cruz: ఇలియానాకు తమిళ్ ఇండస్ట్రీ షాక్.. ఇకపై నో మూవీస్!

Related News

Data Scam: దేశంలో బిగ్గెస్ట్ డేటా స్కామ్.. 16 కోట్ల మంది డేటా చోరీ!
నిత్యం సోషల్ మీడియా ఆప్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారా? కీలక బ్యాంకుల్లో భారీగా సేవింగ్స్ చేశారా?