Ileana D’Cruz: ఇలియానాకు తమిళ్ ఇండస్ట్రీ షాక్.. ఇకపై నో మూవీస్!
ఇలియానాపై తమిళ పరిశ్రమ నిషేధం విధించింది. అవును, మీరు చదివింది నిజమే.
- By Balu J Published Date - 10:48 AM, Fri - 10 March 23

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బోల్డ్ హీరోయిన్స్ లో ఇలియానా డి’క్రూజ్ ఒకరు. దాదాపు 17 ఏళ్లుగా సినీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. 2006లో తెలుగు సినిమా దేవదాసుతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మహేశ్, పూరి కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి మూవీలో ఆకట్టుకుంది. 2012లో అనురాగ్ బసు బర్ఫీలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తాజా సమాచారం ప్రకారం ఇలియానాపై తమిళ పరిశ్రమ నిషేధం విధించింది. అవును, మీరు చదివింది నిజమే.
ఒక సినిమా కోసం అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నారని, అయితే షూటింగ్‌కు హాజరు కావడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, తమిళ నిర్మాత ఆమెపై ఫిర్యాదు చేయడంతో కోలీవుడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్మాత ఆర్థికంగా నష్టపోవడంతో ఇలియానా తమిళ చిత్రాలలో కనిపించకుండా నిషేధం విధించారు. ఆమె చివరి తమిళ చిత్రం, ‘నన్బన్,’ 2012లో విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి రివ్యూ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Related News

Dhanush Body Shaming: ఆటో డ్రైవర్ లా ఉన్నాడు, వీడు హీరో ఏంటీ? ధనుష్ పై బాడీ షేమింగ్
హీరో రజనీకాంత్ అల్లుడిగా పేరున్నప్పటికీ ధనుష్ (Dhanush) కూడా కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.