BRS Menfesto 2023 : తెలంగాణ లో సరికొత్త పథకాలను ప్రకటించబోతున్న కేసీఆర్..
ప్రస్తుతం తెలంగాణ లో కూడా అదే నడుస్తుంది. మరో రెండు , మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు అనేక పథకాలను ప్రకటించేపనిలో ఉన్నారు.
- Author : Sudheer
Date : 29-09-2023 - 6:04 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల పథకాలను ప్రకటిస్తుంటారు. ఈ పథకాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తారు. ప్రస్తుతం తెలంగాణ లో కూడా అదే నడుస్తుంది. మరో రెండు , మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో అధికార పార్టీ (BRS) తో పాటు ప్రతిపక్ష పార్టీలు అనేక పథకాలను ప్రకటించేపనిలో ఉన్నారు. ఇప్పటీకే కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వస్తే పలు పథకాలను ప్రవేశ పెడతామని హామీ ఇచ్చింది.
- * మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం – రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- * ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని వారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం
- * చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్. రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
- * గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- * రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు
- * యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా హైదరాబాద్ సభ వేదికగా రాహుల్ & సోనియా ప్రకటించారు.
ఈ పధకాల పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పధకాల ఫై ప్రజల దృష్టి పడింది. ఇప్పటీకే రెండుసార్లు బిఆర్ఎస్ కు ఛాన్స్ ఇచ్చాం..ఈసారి కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో తెలంగాణ ప్రజలు పడ్డారు. దీనిని గ్రహించిన గులాబీ బాస్ అంతకు మించే అనేలా కొత్త పథకాలను ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం.
కేసీఆర్ (KCR) అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో ఎన్నో పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలనే కాదు దేశ ప్రజలను సైతం ఆశ్చర్య పరిచారు. ఇలాంటి పధకాలు మా రాష్ట్రాల్లో కూడా ప్రవేశ పెట్టాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి దిమ్మతిరిగిపోయే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని.. త్వరలోనే అన్ని వర్గాల వారు శుభవార్త వింటారు అని తాజాగా మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఇప్పటికే కేసీఆర్ చెప్పిన ప్రతిమాట చేసి చూపించారని.. ఉచిత కరెంట్, ఎకరానికి రైతుబంధు రూ.5వేలు ఇస్తా అన్నట్లే ఇస్తున్నాడు. ఫింఛన్, ఆడ పిల్ల పెళ్లికి రూ.1లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మీ, బిడ్డ డెలివరీకి వెళ్లితే.. కేసీఆర్ కిట్, డెలివరీ అయిన తరువాత 12, 13 వేలు అందిస్తున్నాడు. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తూ..ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు..మరోసారి అధికారం లోకి మరిన్ని పథకాలను తీసుకరాబోతున్నాడని హరీష్ తెలిపారు. హరీష్ రావు మాటలను బట్టి చూస్తే ఈసారి బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అంతకు మించేలా అనేలా ఉండబోతుందని అర్ధం అవుతుంది.
Read Also : Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రెసిడెంట్ ఆమోద ముద్ర