HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Manifesto Released

BRS Manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుద‌ల‌

ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో ను సిద్ధం చేసినట్లు తెలిపారు

  • By Sudheer Published Date - 02:40 PM, Sun - 15 October 23
  • daily-hunt
Brs Manifesto 2023 Released
Brs Manifesto 2023 Released

తెలంగాణ ఎన్నికల సమరం (Telangana Assembly Elections) మొదలైంది. మరో 45 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ (TRS) ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..నేడు 51 మంది అభ్యర్థులకు బీ ఫారాలు (KCR Disributes b forms to BRS Candidates ) అందజేశారు. మిగతా వారికీ రెండు రోజుల్లో అందజేస్తామని తెలిపారు. అనంతరం 2023 మేనిఫెస్టో ను విడుదల చేసారు.

ఈ మేనిఫెస్టో ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉండే..కాంగ్రెస్ పార్టీ (Congress Party ) ఈసారి ఎన్నికల్లో తెలంగాణ లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా , ఆరు గ్యారెంటీ లతో ఈసారి తాము తప్పనిసరి విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. మరోపక్క బిజెపి సైతం అంతే విధంగా విశ్వసంగా ఉంది. రాష్ట్రంలో , కేంద్రంలో ఒకేపార్టీ ఉంటె రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని చెపుతూ వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం తో ప్రచారం చేస్తుంది. రాష్ట్రానికి 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని , అయితే కేసీఆర్ (KCR) ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తుంది. ఇలా ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు దీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ బాస్ సిద్ధం అయ్యారు.

హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్‌ ప్రజలకు వెల్లడించారు. ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో గతంలో తాము 10 శాతం చెబితే.. అమలు మాత్రం 90 శాతం చేశామని కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మైనార్టీల బడ్జెట్ ను పెంచుతామన్నారు. వారి సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. మైనార్టీ జూనియర్ కాలేజీలను డగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామన్నారు.

BRS మేనిఫెస్టో 2023 హైలైట్స్ :

  • రైతు బంధు పెంపు ( రైతు బంధు పథకం కూడా ఇప్పుడున్న పదివేలను పదహారు వేలకు పెంచుకుంటూ పోతాం. 12 వేల నుంచి మొదలు పెట్టి 16 వేలకు తీసుకెళ్తాం)
  • సౌభాగ్య లక్ష్మి పేరుతో (అర్హులైన మహిళలకు నెలకు మూడు వేలభృతి ఇవ్వాలని నిర్ణయం)
  • గ్యాస్‌ సిలిండర్‌ పై రాయితీ (అర్హులైన ప్రజలకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్‌. అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్)
  • ఆరోగ్య శ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు (సాధారణ ప్రజలతోపాటు జర్నలిస్టులకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు)
  • హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు (ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు)
  •  పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి (సౌభాగ్యలక్ష్మీ పథకం కింద బీపీఎల్‌ కింద ఉన్న పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి )
  • పేద మహిళలకు 400కే గ్యాస్‌ సిలిండర్‌ (అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు, గ్యాస్‌ ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై అడ్డగోలు భారం మోపుతుంది. తెలంగాణలో చాలామంది మళ్లీ గ్యాస్‌ స్టవ్‌లు మానేసి కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. ఈ బాధలు పోవాల్సి ఉంది. అందుకే అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేయాలని నిర్ణయించాం)
  •  రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం (తెల్ల రేషన్ కార్డు కలిని వారందరికీ ‘తెలంగాణ అన్నపూర్ణ స్కీమ్’ పేరిట సన్నబియ్యం )
  •  ప్రజలందరికీ ఐదు లక్షల కేసీఆర్ బీమా (తెల్లకార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు)
  •  నెల పింఛన్లు ఐదు వేలకు పెంపు (ఒకే సారి కాకుండా.. ప్రతీ ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో ఏడాది పూర్తయ్యే నాటికి రూ.5 వేలకు పింఛన్)
  •  దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలు ( దివ్యాంగులకు అందించే పింఛన్ ప్రస్తుతం రూ.4 వేలుగా ఉన్న పింఛన్ ను రూ.6 వేలకు పెంచుతామన్నారు. మార్చి తర్వాత రూ.5 వేలకు పెంచుతామని.. దశల వారీగా ప్రతీ ఏడాది రూ.300 పెంచుకుంటూ చివరి ఏడాది నాటికి రూ.6 వేలకు చేరుకునేలా చేస్తామన్నారు)
  •  దళితబంధు పథకం కొనసాగింపు
  •  కేసీఆర్ బీమా-ప్రతీ ఇంటికి ధీమా (ఎల్ఐసీ ద్వారానే ఈ బీమా కొనసాగింపు )
  •  రైతుబంధు 16 వేలకు పెంపు (మొదటి సంవత్సరం రూ.12వేలకు పెంచుతాం. తర్వాత ప్రతి ఏడాది విడతలవారీగా రూ.16వేలకు పెంచుతాం)
  • ముస్లిం బడ్జెట్ పెంపు

హుస్నాబాద్ సభతో గులాబీ బాస్ ప్రచారం…

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 9 వరకు 42 నియోజికవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 11న గజ్వేల్ , కామారెడ్డి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు కేసీఆర్. ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ సెంటిమెంట్ నియోజకవర్గం అయిన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించనున్నారు. 2014 మరియు 2018లో రెండుసార్లు హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ విజయం సాధించారు. మరోసారి కూడా ఇక్కడ్నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు కేసీఆర్. మొత్తం 17 రోజుల్లో 42 సభల్లో పాల్గొననున్నారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు స్థానిక నేతలు. ఈ సభ కోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ చూస్తే..

• అక్టోబర్ 15: హుస్నాబాద్

• అక్టోబర్ 16: జనగాన్ మరియు భువనగిరి

• అక్టోబర్ 17: సిద్దిపేట మరియు సిరిసిల్ల

• అక్టోబర్ 18: జడ్చర్ల మరియు మేడ్చల్

• అక్టోబర్ 26: అచ్చంపేట్, నాగర్ కర్నూల్ ,మునుగోడు

• అక్టోబర్ 27: పాలేరు మరియు స్టేషన్ ఘన్‌పూర్

• అక్టోబర్ 29: కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

• అక్టోబర్ 30: జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్

• అక్టోబర్ 31: హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ

• నవంబర్ 1: సత్తుపల్లి మరియు ఇల్లందు

• నవంబర్ 2: నిర్మల్, బాల్కొండ మరియు ధర్మపురి

• నవంబర్ 3: భైంసా (ముధోల్), ఆర్మూర్ మరియు కోరుట్ల

• నవంబర్ 5: కొత్తగూడెం మరియు ఖమ్మం

• నవంబర్ 6: గద్వాల్, మక్తల్, నారాయణపేట

నవంబర్ 7: చెన్నూరు, మంథని, పెద్దపల్లి

నవంబర్ 8: సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి

నవంబర్ 9: గజ్వేల్ మరియు కామారెడ్డి

 

Read Also : BJP OBC Protest: ఢిల్లీలో కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ ఓబీసీ నిరసనలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Assembly Elections
  • brs
  • brs manifesto 2023
  • brs manifesto 2023 highlights
  • kcr

Related News

Jubilee Hills Bypoll Exit P

Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills Bypoll ) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించారు

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • Jubilee Hills

    JubileeHills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేపే నోటిఫికేషన్ విడుదల!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd